AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ కంటే వైసీపీనే ఎక్కువ దాడులు చేస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ

ఏపీలో వైసీపీపై బీజేపీ మాటల దాడిని పెంచింది. నిన్నటివరకూ టీడీపీ తరహాలోనే వైసీపీ దాడులు చేస్తోందని చెప్పిన ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఇప్పుడు టీడీపీ కంటే వైసీపీనే ఎక్కువ దాడులు చేస్తోందని అన్నారు. సీఎం జగన్ చెబుతున్న మాటలకు, క్షేతస్థాయిలో జరిగే పనులకు ఏ మాత్రం పొంతన లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీనే ప్రతిపక్షపార్టీ పోషిస్తోందని.. ఏపీలో 25లక్షల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకున్నామని.. జనసేన, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నుంచి కూడా కార్యకర్తలు పోటెత్తుతున్నారని […]

టీడీపీ కంటే వైసీపీనే ఎక్కువ దాడులు చేస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 15, 2019 | 9:12 PM

Share

ఏపీలో వైసీపీపై బీజేపీ మాటల దాడిని పెంచింది. నిన్నటివరకూ టీడీపీ తరహాలోనే వైసీపీ దాడులు చేస్తోందని చెప్పిన ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. ఇప్పుడు టీడీపీ కంటే వైసీపీనే ఎక్కువ దాడులు చేస్తోందని అన్నారు. సీఎం జగన్ చెబుతున్న మాటలకు, క్షేతస్థాయిలో జరిగే పనులకు ఏ మాత్రం పొంతన లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీనే ప్రతిపక్షపార్టీ పోషిస్తోందని.. ఏపీలో 25లక్షల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకున్నామని.. జనసేన, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నుంచి కూడా కార్యకర్తలు పోటెత్తుతున్నారని అన్నారు. 2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కన్నా జోస్యం చెప్పారు.

Follow Us