టీడీపీకి ‘టాటా’ చెప్పనున్న ఆ ముగ్గురు..? బాబుకు పెద్ద షాక్ తప్పదా..!

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 23 సీట్లు సాధించి ఘోర పరాజయం పాలైన టీడీపీకి బ్యాడ్ టైమ్ కొనసాగుతూనే ఉంది. అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్‌గానే ఉన్నప్పటికీ.. టీడీపీలో ఇన్ని రోజులు కీలకంగా ఉన్న పలువురు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. వారిలో కొంతమంది వేరే పార్టీ కండువాలను కూడా కప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న మరికొన్ని పెద్ద తలకాయలు కూడా త్వరలోనే టీడీపీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో ప్రముఖంగా […]

టీడీపీకి 'టాటా' చెప్పనున్న ఆ ముగ్గురు..? బాబుకు పెద్ద షాక్ తప్పదా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 22, 2019 | 5:09 PM

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 23 సీట్లు సాధించి ఘోర పరాజయం పాలైన టీడీపీకి బ్యాడ్ టైమ్ కొనసాగుతూనే ఉంది. అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్‌గానే ఉన్నప్పటికీ.. టీడీపీలో ఇన్ని రోజులు కీలకంగా ఉన్న పలువురు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. వారిలో కొంతమంది వేరే పార్టీ కండువాలను కూడా కప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న మరికొన్ని పెద్ద తలకాయలు కూడా త్వరలోనే టీడీపీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో ప్రముఖంగా గంటా శ్రీనివాసరావు, నారాయణ, బోండా ఉమ పేర్లు వినిపిస్తున్నాయి.

కాపు సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమ 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత తక్కువ సమయంలోనే అధినేత చంద్రబాబుకు దగ్గరయ్యారు. అంతేకాదు అప్పటి ప్రతిపక్షం వైసీపీపై అవకాశం వచ్చినప్పుడల్లా స్వరాన్ని పెంచి మరీ ఘాటుగా విమర్శించేవారు. కానీ 2019 ఎన్నికలకు ముందు నుంచి పరిస్థితులు మారిపోయాయి. పార్టీలోని కొందరు నేతల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తోన్న ఆయన.. ఎన్నికల తరువాత పార్టీ ఓటమితో ఆయన తీరు మారిపోయింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీలో చేరేందుకు బోండా ఉమ ఆలోచిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి వైసీపీ నేత ఆమంచితో ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

ఇక బోండా ఉమ దారిలోనే చంద్రబాబు మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన గంటా శ్రీనివాసరావు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైసీపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. తన రాజకీయ జీవితాన్ని టీడీపీతోనే ప్రారంభించిన గంటా.. ఆ తరువాత మధ్యలో పార్టీని వీడినప్పటికీ.. 2014లో మళ్లీ సొంతగూటికే వెళ్లారు. ఇక 2014-19 వరకు చంద్రబాబు కేబినెట్‌లోనూ పని చేశారు. ఇక ఈ ఎన్నికల తరువాత ఈయన కూడా పార్టీని వీడబోతున్నారని వార్తలు వచ్చాయి. దానికి తోడు వైసీపీలోకి తాను వెళ్లాలనుకుంటే ఎవ్వరూ ఆపలేరని ఆ మధ్యన గంటా కామెంట్లు కూడా చేశారు. అయితే వైసీపీలోకి ఈయన రాకను కొంతమంది వ్యతిరేకిస్తున్నారని గాసిప్‌లు వినిపించినా.. ఇప్పుడు గంటా చేరికకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. దీంతో త్వరలోనే గంటా కూడా వైసీపీ కండువాను కప్పుకోనున్నారని సమాచారం.

అయితే బోండా, గంటా చూపు వైసీపీ వైపు ఉంటే.. మాజీ మంత్రి నారాయణ చూపు మాత్రం బీజేపీ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీకి ఆర్థిక స్తంభంగా నిలిచిన నారాయణ.. పరిస్థితి ఈ ఎన్నికల తరువాత బాగా మారిపోయింది. ఎన్నికలకు ముందే ఆయనకు సంబంధించి విద్యా సంస్థలపై ఐటీ, సీబీఐ దాడులు జరిగాయి. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత సీబీఐను రాష్ట్రంలోకి అనుమతినిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో మళ్లీ ఎప్పుడైనా దాడులు జరిగితే.. ఆయన విద్యా సంస్థలకు ముప్పు వాటిల్లే  పరిస్థితి తప్పకపోవచ్చు. ఇక రాజకీయాల కంటే తమ వ్యాపారాలే కీలకమని భావించిన కొంతమంది టీడీపీ ఎంపీలు ఆ మధ్యన మూకుమ్మడిగా బీజేపీలో చేరారు. ఇప్పుడు వారి బాటలోనే నారాయణ కూడా వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనను బీజేపీలోకి చేర్చుకునేలా బీజేపీ అధిష్టానంతో మాట్లాడాలని తన జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేతను కోరారట. దీనికి ఆ నేత నుంచి సానుకూల స్పందన కూడా వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చాలా త్వరలోనే నారాయణ.. టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.

వీటిలో నిజమెంతుందో తెలీదు గానీ.. టీడీపీలో ఇన్ని రోజులు కీలకంగా వ్యవహరించిన ఈ ముగ్గురు ఘనాపాటీలు ఆ పార్టీని వీడితే.. చంద్రబాబుకు పెద్ద షాక్ తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీకి చెందిన సీనియర్ నేతల వరుస హఠాన్మరణాలతో బాధపడుతోన్న ఆయనపై ఈ రాజకీయ వలసల టెన్షన్ పడే సమయం దగ్గర్లోనే ఉందన్నవార్తలువినిపిస్తున్నాయి.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!