షర్మిలకు కీలక పదవి ఇవ్వబోతున్న జగన్..!

ముఖ్యమంత్రి అయ్యేందుకు వైఎస్ జగన్ దాదాపు పది సంవత్సరాలు చాలా కష్టాలనే ఎదుర్కొన్నారు. తండ్రి వైఎస్సార్ మరణం తరువాత కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి బయటకు రావడం.. వైఎస్సార్ పార్టీని స్థాపించడం.. ఆ తరువాత జైలుకు వెళ్లి రావడం.. 2014లో తమ పార్టీ తరఫున మొదటిసారి పోటీ చేసి ప్రతిపక్షానికే పరిమితం కావడం.. ఆ తరువాత పాదయాత్ర చేసి ప్రజల అభిమానం చూరగొని అధికారంలోకి రావడం ఇలా వరుసగా జరిగాయి. అయితే ఆయన జైలుకు వెళ్లిన సమయంలో పార్టీని […]

షర్మిలకు కీలక పదవి ఇవ్వబోతున్న జగన్..!
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2019 | 5:06 PM

ముఖ్యమంత్రి అయ్యేందుకు వైఎస్ జగన్ దాదాపు పది సంవత్సరాలు చాలా కష్టాలనే ఎదుర్కొన్నారు. తండ్రి వైఎస్సార్ మరణం తరువాత కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి బయటకు రావడం.. వైఎస్సార్ పార్టీని స్థాపించడం.. ఆ తరువాత జైలుకు వెళ్లి రావడం.. 2014లో తమ పార్టీ తరఫున మొదటిసారి పోటీ చేసి ప్రతిపక్షానికే పరిమితం కావడం.. ఆ తరువాత పాదయాత్ర చేసి ప్రజల అభిమానం చూరగొని అధికారంలోకి రావడం ఇలా వరుసగా జరిగాయి. అయితే ఆయన జైలుకు వెళ్లిన సమయంలో పార్టీని కాపాడింది ఆయన సోదరి వైఎస్ షర్మిల అనడంలో ఎలాంటి సందేహం ఉండదు.

అన్న తరఫున బాధ్యతలు తీసుకొని ‘‘జగన్ అన్న వదిలిన బాణాన్ని’’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన షర్మిల అప్పట్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. అంతేకాదు 2014, 19 ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున ప్రచారం చేసిన ఆమె.. టీడీపీ నేతలపై ఓరేంజ్‌లో పంచ్ డైలాగ్‌లు విసిరారు. ప్రచారంలో ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్‌లను టార్గెట్‌ చేసిన ఆమె.. చిరు, పవన్‌లను కూడా వదల్లేదు. వారిపై కూడా విమర్శల వర్షం కురిపించారు. అయితే అన్నను సీఎంగా చేయడమే ముఖ్య ఉద్దేశ్యంగా ప్రచారాలు చేసిన ఆమె.. జగన్ సీఎం అయిన తరువాత కూడా ఏ పదవినీ ఆశించలేదు. మరోవైపు పదవులకు కుటుంబసభ్యులను దూరంగా పెడుతున్న జగన్ కూడా.. మౌనంగా ఉంటూ వస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే షర్మిలకు వైసీపీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. షర్మిలను పార్టీ నేతగా చేయాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. వచ్చే పార్టీ ప్లీనరీ నాటికి వైసీపీలో ఆమెకు కీలక పదవి ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారట. మరోవైపు సీఎంగా జగన్ బిజీగా ఉంటున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.