AP News: రైల్వే పట్టాలపై పెద్ద బండరాయి.. వేగంగా వచ్చి ఢీకొన్న ట్రైన్.. కట్ చేస్తే..
రైల్వే ట్రాక్‌పై పెద్ద బండరాయి జారిపడింది. అటుగా వచ్చిన గూడ్స్ ట్రైన్.. ఆ బండరాయిని ఢీకొనడంతో ఇంజన్ ధ్వంసమైంది. దీంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డీటేల్స్ తెలుసుకుందాం పదండి....
ఇటీవల తరచూ ఎక్కడో అక్కడ రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అగ్ని ప్రమాదాలో.. బండరాళ్లు విరిగిపడటమో లాంటి ప్రమాదాలు సోషల్ మీడియాలో రోజూ చూస్తుంటాం. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో ఓ రైల్వే ట్రాక్‌పై బండరాయి జారిపడింది. అదే ట్రాక్‌పై వచ్చిన గూడ్స్ రైలు దానిని ఢీకొట్టడంతో రైలు ఇంజిన్ దెబ్బతిని రైలు నిలిచిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా కేకే లైన్‌లో శివలింగపురం వద్ద రైల్వే ట్రాక్ పై ఈ ఘటన జరిగింది. దీంతో.. ఈ రూట్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు రైల్వే అధికారులు. కేకే లైన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనతో.. ఎస్.కోటలో విశాఖ – కిరండోల్ పాసింజర్ రైలు నిలిచిపోయింది. రైల్వేశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ కోట రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీలైనంత త్వరగా కేకే లైన్‌ను క్లియర్ చేసి.. రైళ్ల రాకపోకలు యథావిథిగా సాగేలా చూడాలని డిమాండ్ చేశారు. కాగా, జిల్లాలోని కొత్తవలస-కిరండూల్ లైన్‌పై గతంలోనూ రైల్వే ట్రాక్ పై బండరాళ్లు పడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…