AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Floods: కృష్ణా నదికి భారీగా వరద.. పెన్నాకు పెరిగిన ప్రవాహం.. ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తివేత..

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో కృష్ణా నదికి మరోసారి వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి..

Krishna Floods: కృష్ణా నదికి భారీగా వరద.. పెన్నాకు పెరిగిన ప్రవాహం.. ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తివేత..
Srisailam
Ganesh Mudavath
|

Updated on: Oct 16, 2022 | 10:09 AM

Share

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో కృష్ణా నదికి మరోసారి వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నదిపై ఉన్న జలాశయాలకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు స్పిల్‌ వే 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3.77 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్, పులిచింతలలోకి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో ఉద్ధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి శనివారం సాయంత్రానికి 4.5 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

మరోవైపు.. కర్నాటక, రాయలసీమలో కురుస్తున్న వర్షాలతో పెన్నా దాని ఉప నదుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. ఉప నదులు జయమంగళ, కుముద్వతి, కుందు, బాహుదా, చిత్రావతి, పాపాఘ్ని, పించా, సగిలేరులో ప్రవాహం అధికంగా ఉంది. నెల్లూరు బ్యారేజ్‌ నుంచి 81 వేల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పెన్నా ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారాయి. దీంతో నెల్లూరు బ్యారేజ్‌ వరకు ప్రాజెక్టుల గేట్లు అన్నీ ఎత్తేశారు. కాగా.. ఈ సీజన్‌లో నెల్లూరు బ్యారేజీ గేట్లను రెండోసారి ఎత్తేయడం కావడం విశేషం.

కనువిందు చేస్తున్న వాటర్ ఫాల్స్..

ఇవి కూడా చదవండి

మరోవైపు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లాలోని జలపాతాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. నంద్యాల జిల్లా అవుకు మండలం మంగంపేట కొండల మధ్య జలపాతం పర్యాటకుల మనసు దోచుకుంటోంది. కరవు ప్రాంతంగా పిలవబడే కర్నూలు జిల్లాలో వర్షాలు కురవడం, జలపాతాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి.

ప్రియురాలిని చంపి సంచిలో ప్యాక్ చేసిన ప్రియుడు.!
ప్రియురాలిని చంపి సంచిలో ప్యాక్ చేసిన ప్రియుడు.!
ఇస్రో ఖాతాలో మరో ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
ఇస్రో ఖాతాలో మరో ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
చిన్న గింజల్లో దివ్యౌషధం.. ఈ 7 ప్రయోజనాలు తెలిస్తే.
చిన్న గింజల్లో దివ్యౌషధం.. ఈ 7 ప్రయోజనాలు తెలిస్తే.
'కమెడియన్స్‌ది ఏ స్థానమో మళ్లీ చూపించారు' మీకో దండం
'కమెడియన్స్‌ది ఏ స్థానమో మళ్లీ చూపించారు' మీకో దండం
వదినను హత్య చేసిన మరిది.. ఎందుకో తెలుసా..?
వదినను హత్య చేసిన మరిది.. ఎందుకో తెలుసా..?
డీమాన్ పవన్‌కు జాక్‌ పాట్ విన్నర్‌ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు
డీమాన్ పవన్‌కు జాక్‌ పాట్ విన్నర్‌ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు
ఓరీ దేవుడో.. ఈ బిర్యానీ తిన్నారంటే బతుకు బండి కూలినట్టే..!
ఓరీ దేవుడో.. ఈ బిర్యానీ తిన్నారంటే బతుకు బండి కూలినట్టే..!
వందే భారత్ ప్రయాణికులకు మరో శుభవార్త.. మరో ట్రైన్ కూడా వచ్చేసింది
వందే భారత్ ప్రయాణికులకు మరో శుభవార్త.. మరో ట్రైన్ కూడా వచ్చేసింది
అంతడబ్బు అక్కడెలా దాచావ్‌‌ రా.. పోలీసులే నోరెళ్లబెట్టిన సీన్
అంతడబ్బు అక్కడెలా దాచావ్‌‌ రా.. పోలీసులే నోరెళ్లబెట్టిన సీన్
నేటి తరం హీరోయిన్లకు షాక్ ఇచ్చేలా 92 ఏళ్ల సీనియర్​ నటి ఫిట్‌నెస్
నేటి తరం హీరోయిన్లకు షాక్ ఇచ్చేలా 92 ఏళ్ల సీనియర్​ నటి ఫిట్‌నెస్