Araku Valley: కళ్లు తిప్పుకోనివ్వని అందం.. ఎటు చూసినా ప్రకృతి రమణీయం

ఊటీ, కొడైకెనాల్, సిమ్లా, కులుమనాలి, కాశ్మీర్.... ఈ పేర్లు చెబితేనే మనసు ఆహ్లాదంతో పరవశించిపోతుంది. చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు... ఇలా అక్కడి ప్రకృతి అందాలు చూస్తే కవి కాని వాడికికూడా కవిత్వం తన్నుకొస్తుంది. అయితే ఇప్పుడు అలాంటి ప్రకృతి సోయగమే మన ఏపీలో కనువిందు చేస్తోంది. ప్రకృతి ప్రేమికులను రారమ్మంటోంది.

Araku Valley: కళ్లు తిప్పుకోనివ్వని అందం.. ఎటు చూసినా ప్రకృతి రమణీయం
Araku Valley
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 21, 2024 | 9:16 AM

కళ్లు తిప్పుకోనివ్వని అందం.. ఎటు చూసినా ప్రకృతి రమణీయం.. ఔరా అనిపించే ఆహ్లాదకర వాతావరణం.. ప్రకృతి ప్రేమికుల్లో అంతులేని ఆనందం.. ఎక్కడో డార్జిలింగ్, నైనిటాల్, ముస్సొరినో అనుకుంటున్నారా…! కానే కాదు… పక్కా ఆంధ్రా. విదేశాలకు ఏమాత్రం తీసిపోని అందాలతో పాటు, గ్రామీణ గిరిజన సంస్కృతికి సజీవ సాక్ష్యంగా, ప్రకృతి ఒడిలో విరిసిన అందాల హరివిల్లు మన అరకులోనే ఈ అద్భుత దృశ్యాలు. సీజన్ మొదలుకావడంతో అరకు అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరించింది.

అరకు లోయతో పాటు లంబసింగి, వంజంగిలోని ఈ మేఘాల కొండలు మైమరిపిస్తున్నాయి. ఆకాశమే దిగివచ్చిందా అన్నట్లు ఈ అద్భుత దృశ్యాలు ఔరా అనిపిస్తున్నాయి. అరకులో ఉన్నామా… ఆకాశంలో విహరిస్తున్నామా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. ప్రకృతి రమణీయతకు గిరిజన సంప్రదాయ నృత్యాలు మరింత అందాన్ని అద్దాయి. పైనా మంచు వర్షం… కొండపైన అబ్బురపరిచే నృత్యాలను చూస్తూ పులకించిపోయారు పర్యాటకులు.

అరకు అందాలు అద్భుతమంటున్నారు టూరిస్టులు. సుందర దృశ్యాలకు చూసేందుకు రెండు కళ్లు చాలట్లేదంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు… పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వచ్చిన పర్యాటకులు. ప్రకృతి అందాలు చూసి పరవశించిపోతున్నారు. ఇక ఈ పర్యాటక సీజన్ 6 నెలల పాటు ఉంటుంది. అరకులో ఏర్పాట్లు కూడా అదిరిపోతున్నాయి. టూరిస్ట్ సీజన్‌ కావడంతో సకల సౌకర్యాలు అక్కడ దొరుకుతున్నాయి. మొత్తంగా… ఈ ప్రకృతి వలకబోతున్న అందాలను చూస్తుంటే మన డైరెక్టర్లు సినిమా షూటింగ్‌కు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదనిపిస్తోంది…!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా