AP News: పీచు మిఠాయితో ఏ ముప్పు పొంచి ఉంది..? బ్యాన్ చేస్తారా..?
పీచు మిఠాయి తయారీలో చెక్కరను ఉపయోగిస్తారు. ఇక్కడ దాకా అంతా బాగానే ఉన్నా... మొదట్లో తెల్లగా ఉండే ఈ పీచు మిఠాయి.. క్రమేపి చిన్నారులను ఆకర్షించుకునే విధంగా... కొత్త కొత్త రంగులను సంతరించుకున్నాయి. ఈ రంగుల పీచు మిఠాయిని తయారు చేసేందుకు రోడమైన్-బి అనే రసాయనాన్ని కలపడం మొదలుపెట్టారు.

పీచు మిఠాయి… ఏ ఏగ్జిబిషన్‌కి వెళ్లినా.. ఏ జాతరలోకి అడుగుపెట్టినా.. రంగురంగుల్లో కనిపిస్తూ ఊరిస్తుంది. పీచు మిఠాయి కనిపించగానే… పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలైతే కొని పెట్టమని తెగ మారాం చేస్తారు. అలా నోట్లో వేసుకోగానే.. ఇలా కరిగిపోయే ఈ పీచు మిఠాయి.. ప్రాణాలనే హరిస్తుందట.. అందుకే ఇప్పటికే… పీచు మిఠాయిని కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పీచు మిఠాయి అమ్మకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నోరు ఊరించే పీచు మీఠాయికి చాలానే చరిత్ర ఉంది.. 1897లో అంటే 127 ఏళ్ల కిందట అమెరికాలో విలియం మోరిసన్, జాన్ సి వార్తోన్ అనే వ్యక్తులు కనిపెట్టారు. 1921లో జోసఫ్ లాక్సస్ అనే డెంటిస్ట్.. పీచు మిఠాయి తయారీ యంత్రానికి పలు మార్పులు చేసి.. తక్కువ పెట్టుబడితో ఉపాధిని ఇచ్చే వరంగా మార్చేశారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా.. పాపులర్ అయిపోయింది.
పీచు మిఠాయి తయారీలో చెక్కరను ఉపయోగిస్తారు. ఇక్కడ దాకా అంతా బాగానే ఉన్నా… మొదట్లో తెల్లగా ఉండే ఈ పీచు మిఠాయి.. క్రమేపి చిన్నారులను ఆకర్షించుకునే విధంగా… కొత్త కొత్త రంగులను సంతరించుకున్నాయి. ఈ రంగుల పీచు మిఠాయిని తయారు చేసేందుకు రోడమైన్-బి అనే రసాయనాన్ని కలపడం మొదలుపెట్టారు. దీంతో… ఈ పీచు మిఠాయి.. రోజ్, ఎల్లో, పింక్‌తో పాటు పలు రంగులలో తయారయ్యి ప్రజల ముందుకు వచ్చింది. అయితే.. ఇక్కడి నుంచే అసలు చిక్కు వచ్చి పడింది.
పీచు మిఠాయి తయారీలో… వాటికి రంగు రావడం కోసం.. వాడే రోడమైన్-బి అనే కెమికల్… క్యాన్సర్ కారకంగా ఇటీవల కొన్ని పరిశోధనల్లో తేలింది. దీంతో ముందుగా..కేరళ రాష్ట్రంలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు పీచు మిఠాయిని నిషేధించారు. తర్వాత తమిళనాడు ప్రభుత్వం కూడా అప్రమత్తమై.. పీచు మిఠాయిని నిషేధిస్తూ చర్యలు చేపట్టింది.. ఎవరైనా కాటన్ క్యాండిని అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించింది.. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో కూడా పీచు మిఠాయి విక్రయాలు నిషేధిస్తున్నట్లు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు.
లేటెస్ట్‌గా… పీచు మిఠాయి అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి శాంపిళ్లను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సేకరించిన శాంపిళ్లను టెస్టింగ్ కోసం అధికారులు పంపనున్నారు. ల్యాబ్ టెస్టింగ్ ఆధారంగా ఏపీలో పీచు మిఠాయిపై నిషేధంపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. రోడమైన్-బి కెమికల్.. దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లో వాడతారు. ఆహారంలో రంగు కోసం కూడా ఉపయోగిస్తారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందంటున్నారు వైద్యులు. కిడ్నీ, లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని, క్యాన్సర్‌కు కూడా దారితీసే ప్రమాదముందని వార్నింగ్ ఇస్తున్నారు.
ఇప్పటికైనా.. క్యాన్సర్ కారకమైన పీచు మిఠాయి విషయంలో.. పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని.. వాటిని… పిల్లలకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు వైద్యులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



