AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Katragadda Aruna: మేరీ ల్యాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా అరుణ ఎన్నిక.. స్వగ్రామం వెంట్రప్రగడలో అంబరాన్ని అంటిన సంబరాలు

అగ్ర రాజ్యంలో అరుణ అరుదైన గౌరవం సాధించడం తమకు ఎంతో గర్వంగా ఉందని, అరుణ విజయంతో కృష్ణాజిల్లాలోని మారుమూల గ్రామమైన వెంట్రప్రగడకు ఎంతో పేరు వచ్చిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Katragadda Aruna: మేరీ ల్యాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా అరుణ ఎన్నిక.. స్వగ్రామం వెంట్రప్రగడలో అంబరాన్ని అంటిన సంబరాలు
Katragadda Aruna
Surya Kala
|

Updated on: Nov 10, 2022 | 1:21 PM

Share

అమెరికా మేరీలాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్‌గా కాట్రగడ్డ అరుణ మిల్లర్ ఘనవిజయం సాధించడంతో ఆమె గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వెంట్రపగడ గ్రామానికి చెందిన కాట్రగడ్డ అరుణ మిల్లర్ స్వస్థలం. అగ్రరాజ్యం అమెరికాలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా అరుణ విజయం సాధించడంతో వెంట్రప్రగడ గ్రామంలో బంధువులు, గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసిన గ్రామస్తులు, బంధువులు మిఠాయిలు తినిపించుకుంటు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అగ్ర రాజ్యంలో అరుణ అరుదైన గౌరవం సాధించడం తమకు ఎంతో గర్వంగా ఉందని, అరుణ విజయంతో మారుమూల గ్రామమైన వెంట్రప్రగడకు ఎంతో పేరు వచ్చిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మేరీ ల్యాండ్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన అరుణ బాలలందరికి విద్య, మహిళలకు సమాన అవకాశాలపై అరుణ చేసిన కృషికి అక్కడి ప్రజలు పట్టడం కట్టారని అరుణ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇండియా అంటే ఆమెకు ఎంతో ఇష్టమని, వెంట్రప్రగడ వచ్చినప్పుడు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాల్లో ఆమె పాల్గొనేదని గ్రామ పెద్దలు తెలిపారు. తమ గ్రామానికి పేరు తెచ్చిన అరుణ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.  అరుణా మిల్లర్‌లో, ఆమె తండ్రితో ఆమకు ఉన్న అనుబంధాన్ని  గుర్తు చేసుకుంటూ గ్రామస్థులు .. అరుణ సేవా గుణమే ఈ స్థాయికి చేర్చిందని ప్రశంసించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నారు. అమెరికాలో ఉంటున్నా అరుణా మిల్లర్‌ మన సాంస్కృతి సాంప్రదాయాలను మరచిపోలేదని వెంట్రపగడ గ్రామస్తులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..