AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tenali: బైక్ చోరీ కేసులో ఓ వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు.. అతడిచ్చిన సమచారంతో ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా..

సరుకు చిక్కట్లా.. పోలీసుల టెన్టన్ ఎక్కువైంది. దీంతో పక్కాగా ప్లాన్ చేసి ఇంటి పెరట్లోనే దుకాణం పెట్టేశాడు ఓ యువకుడు. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు.

Tenali: బైక్ చోరీ కేసులో ఓ వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు.. అతడిచ్చిన సమచారంతో ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా..
Ganja Plants
Ram Naramaneni
|

Updated on: Nov 10, 2022 | 9:55 AM

Share

యువత మత్తు బారిన పడి చిత్తవుతుంది. ఈ మధ్య కాలంలో కృష్ణా, గుంటూరు జిల్లాలలోని యువత పెద్ద ఎత్తున ఈ గంజాయికి అలవాటు పడ్డట్లు అనధికార సమాచారం ఉంది. దీంతో పోలీసులు అలెర్టయ్యారు. అనుమానితులు ఉంటున్న ప్రాంతాల్లో మెరుపు దాడులు చేస్తూ.. మత్తు గుట్టు విప్పుతున్నారు. కాగా తాజాగా బైక్ చోరీ కేసులో ఓ వ్యక్తిని విచారిస్తున్న వన్‌టౌన్‌ పోలీసులకు మరో క్రైమ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. అతడు ఇచ్చిన సమాచారంతో స్థానిక పోలీసుల సెబ్ అధికారులు.. నందులపేటలోని పిల్లి గోపి(23)  అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. అతని ఇంటి పెరట్లో గంజాయి మొక్కలను గుర్తించారు పోలీసులు. పోలీసులు తెలిపిన డీటేల్స్ ప్రకారం… గుంటూరుకు చెందిన గోపి.. తన తల్లితో తెనాలిలో ఉంటున్నాడు. హోటల్స్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే అతడు డబ్బు సంపాదన కోసం అడ్డదారి తొక్కాడు. తన ఇంటి పెరట్లో పిచ్చి మొక్కల మాటున గుట్టుగా గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. ఆపై ఆకులను తెంపి.. పట్టణ శివారు ప్రాంతాల్లో కాలేజ్ స్టూడెంట్స్‌కు విక్రయిస్తున్నాడు. అయితే పోలీసులు స్పాట్‌కు వచ్చేసరికి.. నిందితుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. పట్టణ నడి సెంటర్‌ వద్ద గల ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఇలా గంజాయి పెంచే ఇద్దరు.. ముగ్గుర్ని ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం మోపడంతో.. కొందరు ఇలా ఇళ్లలోనే గంజాయి పెంపకం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

కాగా స్థానికులు సమాచారం ఇవ్వడంతో గోపిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొన్ని చోట్ల ఇలా గంజాయి మొక్కలు పెంచుతున్నట్టు అనుమానిస్తున్నారు. గుంటూరు జిల్లాలో కొద్ది రోజులుగా గంజాయిని అరికట్టడంపై దృష్టిపెట్టామని పోలీసులు అంటున్నారు.  ఇలాంటి కేసుల్లో కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?
APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!
ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..
ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..
రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?
రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?
ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఎడారిలో పిల్లల కోసం నీటిని మోసుకొచ్చే పక్షి..
ఎడారిలో పిల్లల కోసం నీటిని మోసుకొచ్చే పక్షి..
ఆ గ్రామంలో రాత్రికి రాత్రే మిస్సవుతున్న కోళ్లు, మేకలు..
ఆ గ్రామంలో రాత్రికి రాత్రే మిస్సవుతున్న కోళ్లు, మేకలు..
కుంచించుకుపోతున్న బుధ గ్రహం! అసలు కారణమేంటి..?
కుంచించుకుపోతున్న బుధ గ్రహం! అసలు కారణమేంటి..?