AP Politics: పులివెందులలోనైనా పోటీకి సై.. ఆ పార్టీతో పొత్తుపై బీజేపీ నేత హాట్ కామెంట్..

Adi Narayana Reddy: పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పులివెందులలో పోటీకైనా నేను సిద్ధమేనని ఆదినారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని ఈ పాలను అంతమొందించాలంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లడమే మంచిదని నేను అనుకుంటున్నానని కేంద్రం కూడా ఈ విధంగానే భావిస్తుందని అనుకుంటున్నానని ఆదినారాయణ రెడ్డి అన్నారు.

AP Politics: పులివెందులలోనైనా పోటీకి సై.. ఆ పార్టీతో పొత్తుపై బీజేపీ నేత హాట్ కామెంట్..
Adi Narayana Reddy
Follow us
Sudhir Chappidi

| Edited By: Sanjay Kasula

Updated on: Sep 14, 2023 | 8:47 PM

కడప జిల్లా, 14 సెప్టెంబర్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులు ఎత్తులపై నేతలు హాట్ హాట్ కామెంట్స్ చేసుకుంటున్నారు. నిన్నటి వరకు పొత్తులపై స్తబ్దుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు పొత్తులపై క్లారిటీ ఇవ్వడంతో బిజెపి నేతలు కూడా పొత్తులపై కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే బిజెపి నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పొత్తులపై హాట్ కామెంట్స్ చేశారు వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని ఆశిస్తున్నానని.. తాను పులివెందులలో పోటీ చేయడానికి అయినా సిద్ధమేనని ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కడప జిల్లా ముఖ్య నేతలలో ఒకరైన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తన పొలిటికల్ కెరియర్ పై ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించారు. గత ఎన్నికలలో టీడీపీ తరఫున కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి వైసీపీ అధికారంలోకి రావడంతో టిడిపిని వీడి బిజెపిలో చేరారు. ఆ తరువాత ఈ నాలుగేళ్లుగా జగన్ పై అప్పుడప్పుడు విమర్శలు చేస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారు అయితే ఈరోజు తన ఎన్నికలలో పోటీపై ఒక క్లారిటీని ఇచ్చారు.

ఆదినారాయణ రెడ్డి వచ్చే ఎన్నికలలో టిడిపి, బిజెపి, జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని ఆకాంక్షిస్తున్నానని ఇప్పటికే పవన్ టిడిపి తో కలిసి ముందుకు వెళ్లడానికి తన ఆలోచనను ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం కూడా దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ ఇస్తుందని ఇప్పటికే కేంద్రానికి రాష్ట్రాల్లో ఉన్న బిజెపి నేతలు అందరం కొన్ని సంకేతాలను పంపించామని అవి మూడు పార్టీలు పొత్తులకి అనుకూలంగా ఉండే విధంగానే ఉంటాయని అనుకుంటున్నానని ఆదినారాయణ రెడ్డి అన్నారు.

అంతేకాకుండా నేను బిజెపి తరఫున కడప పార్లమెంటు సీటును ఆశిస్తున్నారని ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్లాలని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అయితే పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పులివెందులలో పోటీకైనా నేను సిద్ధమేనని ఆదినారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని ఈ పాలను అంతమొందించాలంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లడమే మంచిదని నేను అనుకుంటున్నానని కేంద్రం కూడా ఈ విధంగానే భావిస్తుందని అనుకుంటున్నానని ఆదినారాయణ రెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని ఎటువంటి ఆధారాలు లేకుండా కావాలనే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేశారని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో వైసీపీని ప్రజలు గెలవనివ్వరని ఆదినారాయణ రెడ్డి అన్నారు.

గత కొంతకాలంగా తన రాజకీయ జీవితంపై క్లారిటీ ఇవ్వని ఆదినారాయణ రెడ్డి ఈసారి ఫుల్ క్లారిటీ ఇచ్చి కడప పార్లమెంట్లో గాని పులివెందులలో గాని పోటీకి సిద్ధమని స్పష్టం చేయడంతో వచ్చే ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి పోటీ ఖాయమని స్పష్టంగా అర్థమవుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం