Suman: ఏపీలో బీసీలకు రక్షణ లేదు.. ఆ పార్టీకే మద్దతు ఇవ్వాలి.. నటుడు సుమన్‌ సంచలన వ్యాఖ్యలు

|

Jun 26, 2023 | 6:31 AM

ఏపీ రాజకీయాలపై ప్రముఖ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీసీల కోసం కొత్తగా రాజకీయ పార్టీ రావాల్సి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై కీలక కామెంట్స్ చేశారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహాన్ని టీడీపీ మహిళా నేత గౌతు శిరీషతో కలిసి ప్రముఖ నటుడు సుమన్‌ ఆవిష్కరించారు.

Suman: ఏపీలో బీసీలకు రక్షణ లేదు.. ఆ పార్టీకే మద్దతు ఇవ్వాలి.. నటుడు సుమన్‌ సంచలన వ్యాఖ్యలు
Actor Suman
Follow us on

ఏపీ రాజకీయాలపై ప్రముఖ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీసీల కోసం కొత్తగా రాజకీయ పార్టీ రావాల్సి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై కీలక కామెంట్స్ చేశారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహాన్ని టీడీపీ మహిళా నేత గౌతు శిరీషతో కలిసి ప్రముఖ నటుడు సుమన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుమన్‌. ఏపీలో కులానికొక పార్టీ ఉందని.. బీసీలకు మాత్రం లేదన్నారు. ఏపీలో బీసీలకు ప్రత్యేకంగా పార్టీ లేకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చే పార్టీకే మద్దతు ఇవ్వాలని సుమన్ పిలుపునిచ్చారు. పార్టీ మేనిఫెస్టోల్లో బీసీలకు ఏం చేస్తారో  ఆంధ్రప్రదేశ్ లోని ఆయా పార్టీల అధినేతలు స్పష్టం చేయాలన్నారు. ఆ క్రమంలో.. మేలు చేసే పార్టీల వద్దకే బీసీలు వెళ్లాలని సూచించారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే ఏడ్చి ప్రయోజనం లేదు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినందుకే కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిందని సుమన్‌ గుర్తు చేశారు.

మరోవైపు… ఆంధ్రప్రదేశ్‌లో బీసీ వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సుమన్‌. ఏపీ ప్రభుత్వం బీసీల రక్షణ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్‌ పోసి దారుణంగా హత్య చేస్తే ఇప్పటివరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కొన్నిసార్లు సైలెంట్‌గా ఉండటం సరికాదన్న ఆయన.. అవసరమైతే వైలెంట్‌గా మారాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముందు సుమన్ పెదకాకాని శివాలయంలోని మల్లేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తంగా.. సుమన్‌ కామెంట్స్‌ ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..