AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP Leaders: పెనుకొండలో టీడీపీ బస్సు యాత్ర.. భగ్గుమన్న విభేదాలు.. కొట్టుకున్న సవితమ్మ, బీకే పార్ధసారధి వర్గాలు

ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో.. టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. సవితమ్మ, బీకే పార్ధసారధి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జై బీకే అని.. ఓ వర్గం నినాదాలు చేస్తే.. జై సవితమ్మ అంటూ మరో వర్గం రెచ్చిపోయి స్లోగన్స్‌ చేసింది.

TDP Leaders: పెనుకొండలో టీడీపీ బస్సు యాత్ర.. భగ్గుమన్న విభేదాలు.. కొట్టుకున్న సవితమ్మ, బీకే పార్ధసారధి వర్గాలు
Tdp Leaders Fight
Surya Kala
|

Updated on: Jun 26, 2023 | 6:50 AM

Share

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికల నగారా మోగనుండడంతో ప్రధాన, ప్రతి పక్ష నేతలు జనం మధ్యలో ఉంటూ.. సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీడీపీ బస్సు యాత్రల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. టీడీపీలో గ్రూపుల గోల ఒక్కసారిగా బహిర్గతమవుతోంది. పార్టీలో ఆధిపత్యం కోసం తెలుగు తమ్ముళ్లు ఒకరికొకరు కొట్టుకునే స్థాయి వెళ్తున్నారు. తాజాగా.. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర పెనుకొండకు చేరుకుంది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో.. టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. సవితమ్మ, బీకే పార్ధసారధి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జై బీకే అని.. ఓ వర్గం నినాదాలు చేస్తే.. జై సవితమ్మ అంటూ మరో వర్గం రెచ్చిపోయి స్లోగన్స్‌ చేసింది. ఇక.. రెండు వర్గాల నినాదాలతో పెనుగొండ ఎన్టీఆర్‌ సర్కిల్‌ మారుమోగింది. ఈ క్రమంలోనే.. తెలుగు తమ్ముళ్లు ఒకరినొకరు తన్నుకున్నారు. దాంతో.. రెండు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. అప్రమత్తమైన టీడీపీ నేతలు.. ఎవరైనా గ్రూపులు కడితే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయటంతో వివాదం సద్దుమణిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా