Bank employee fraud : రైతుల క్రాప్ లోన్ సోమ్ములు స్వాహా.. బెట్టింగులకు బ్యాంక్ మనీ వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్.!

పశ్చిమ గోదావరి జిల్లాలో బెట్టింగులకోసం బ్యాంకు సొమ్ము స్వాహా చేసిన ఒక అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ బాగోతం బట్టబయలైంది. ఆచంట మండలం ఆచంట యూనియన్ బ్యాంక్ లో

Bank employee fraud : రైతుల క్రాప్ లోన్ సోమ్ములు స్వాహా.. బెట్టింగులకు బ్యాంక్ మనీ వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్.!
Bank Min
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 26, 2021 | 7:39 AM

Assistant Bank Manager Cheating : పశ్చిమ గోదావరి జిల్లాలో బెట్టింగులకోసం బ్యాంకు సొమ్ము స్వాహా చేసిన ఒక అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ బాగోతం బట్టబయలైంది. ఆచంట మండలం ఆచంట యూనియన్ బ్యాంక్ లో సదరు బ్యాంక్ మేనేజర్ రూ. 30 లక్షలు స్వాహా చేశాడు. సదరు బ్యాంకులో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తోన్న నాగరాజు 30 లక్షల రూపాయలు వేరే ఖాతాలకు మళ్ళించినట్లు అధికారులు గుర్తించారు.

ఈ సొమ్మంతా 40 మంది రైతుల క్రాప్ లోన్ మనీ అని బ్యాంక్ ఉన్నతాధికారులు తేల్చారు. నేరం రుజువు కావడంతో అసిస్టెంట్ మేనేజరు నాగరాజును యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ మేనేజర్ నాగరాజు మీద పోలీసు కేసు పెడతామని బ్యాంకు అధికారులు తెలిపారు.

మాస్క్ వేసుకోలేదని బ్యాంక్ కస్టమర్ ని కాల్చిన సెక్యూరిటీ గార్డు :

ఉత్తరప్రదేశ్ బరేలీ కి చెందిన రాజేష్ రైల్వే ఉద్యోగి. ఇక్కడి స్టేషన్ రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో తన పాస్ బుక్ ఎంట్రీలు వేయిన్చుకోవడానికి నిన్న (శుక్రవారం) బ్యాంక్ కు చేరుకున్నారు. కారులో వచ్చిన ఈయన కారు దిగి బ్యాంక్ కు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం మర్చిపోయారు. బ్యాంక్ గేటు ముందు సెక్యూరిటీ గార్డు కేశవ్ ప్రసాద్ మిశ్రా (45) మాస్క్ లేకుండా లోపలి రానివ్వరని చెప్పాడు. దీంతో రాజేష్ వెనుతిరిగి కారు వద్దకు వెళ్లి మాస్క్ పెట్టుకుని మళ్ళీ వచ్చారు.

అయితే, ఈసారి కేశవ్ ప్రసాద్ భోజనాల టైం అయిందనీ.. తరువాత రావాలనీ రాజేష్ ను ఆపివేశాడు. దీంతో రాజేష్ నాకు బ్యాక్నులో ఎక్కువ పనిలేదు. కేవలం పాస్ బుక్ ఎంట్రీ అని చెప్పారు. అయినా సరే గార్డ్ ప్రసాద్ వినలేదు. దీంతో రాజేష్ అతనితో వాదనకు దిగాడు. అయితే, ప్రసాద్ పరుషంగా మాట్లాడి రాజేష్ ను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని గట్టిగా చెప్పాడు. రాజేష్ వినలేదు. దీంతో కోపం పట్టలేని గార్డ్ కేశవ్ ప్రసాద్ తన వద్ద ఉన్న తుపాకీతో రాజేష్ ను కాల్చాడు. దీంతో రాజేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

Read also : EGS : ఉపాది హామీ కూలీల దగ్గర లంచం తీసుకుంటూ వీడియో రికార్డింగ్‌లో దొరికిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్