Vijayasaireddy: అశోక్‌ గజపతి రాజుపై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి.. ఏకంగా వంశ చరిత్రను తిరగతోడుతూ..

Vijayasaireddy: మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజుపై ట్విట్టర్ వేదికగా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి..

Vijayasaireddy: అశోక్‌ గజపతి రాజుపై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి.. ఏకంగా వంశ చరిత్రను తిరగతోడుతూ..
Vijayasai Reddy
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 26, 2021 | 8:20 AM

Vijayasaireddy: మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజుపై ట్విట్టర్ వేదికగా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. తాండ్ర పాపారాయుడన్నా, బొబ్బిలి వెలమ రాజులన్నా పౌరుషానికి ప్రతీక అని.. ఫ్రెంచ్, బ్రిటీష్ సేనలను, పొరుగు రాజ్యం కుట్రలను ఎదుర్కొని, వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. విజయరామ గజపతిలా వారు విదేశీయుల ఎంగిలి మెతుకుల కోసం ఎగబడలేదంటూ అశోక్‌ గజపతి రాజు ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయ రామ గజపతి.. హైదర్ జంగ్, బుస్సీ దొరకు లంచం ఇచ్చి బొబ్బిలి కోట పై దొంగదెబ్బ కొట్టాడని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఒక ఫోటో క్లిప్‌ను ట్విట్టర్‌లో జత చేశారు విజయసాయి రెడ్డి. తండ్రి పీవీజీ రాజులా కాకుండా విజయరామ గజపతిలా మారి అశోక్ గజపతి.. చంద్రబాబుకు కప్పం కడుతూ కుట్రలు చేస్తున్నాడని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఇది 18వ శతాబ్దం కాదని, నీ ఆటలు ఇక సాగవు అంటూ అశోక గజపతిరాజుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గజపతులంటే ఎన్నడూ ప్రజల పక్షాన నిలబడని మోతుబరి జమిందారులు అంటూ ఘాటైన కామెంట్స్ చేశారు.

గోల్కొండ సుల్తానులకు, నిజాం నవాబులకు బానిసలని ఫైర్ అయ్యారు. ఫ్రెంచ్ సైన్యాధిపతి బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలి వెలమ రాజులను దెబ్బతీశారని అన్నారు. అలాంటి గజపతులు ప్రజలను పీడించి, బ్రిటీష్ వారికి కప్పం కట్టేవారంటూ ఫైర్ అయ్యారు. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిషర్లతో కలిసి ప్రజలను గజపతులు హింసించారని తీవ్రమైన కామెంట్స్ చేశారు. పీవీజీ, ఆనంద గజపతిని కాదని పాత వారసత్వాన్నే కొనసాగిస్తున్నావా అశోక్? అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘కప్పు చంద్రబాబుకు కడుతున్నవా? పప్పు నాయుడికి కడుతున్నవా? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడవడంలో మీ పూర్వీకులే మీకు స్ఫూర్తా?’ అని ట్విట్టర్ వేదికగా పరుష వ్యాఖ్యలతో ఫైర్ అయ్యారు విజయాసాయి రెడ్డి.

Vijayasai Reddy Tweets:

ALso read:

Bank employee fraud : రైతుల క్రాప్ లోన్ సోమ్ములు స్వాహా.. బెట్టింగులకు బ్యాంక్ మనీ వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్.!

Actor Anupam Kher: నన్ను అందరూ గుర్తిస్తారు అనుకున్నా.. కానీ అతడు నా గర్వాన్ని పూర్తిగా బద్దలు కొట్టేశాడు.. సీనియర్ నటుడి షాకింగ్ కామెంట్స్..

Horoscope Today: ఈరోజు వీరికి ఖర్చులు పెరుగుతాయి… ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..