AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు వీరికి ఖర్చులు పెరుగుతాయి… ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..

Horoscope Today 22nd June 2021: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

Horoscope Today: ఈరోజు వీరికి ఖర్చులు పెరుగుతాయి... ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..
Horoscope
Rajitha Chanti
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 26, 2021 | 1:55 PM

Share

Horoscope Today 22nd June 2021: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూన్ 26న) శనివారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి.. ఈరోజు వీరికి ఆర్థిక ప్రగతి ఉంటుంది. ఉద్యోగా, వ్యాపార పరంగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించుకోగలుగుతారు. పేదవారికి అన్నదానం చేసుకోవడం మంచిది.

వృషభ రాశి.. ఈరోజ వీరు స్థిర, చరాస్థి, క్రయ, విక్రయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులలో కొంత అనుకూలత ఏర్పడుతుంది. పేదవారికి కాయగూరలు దానం చేయడం మంచిది.

మిథునరాశి.. ఈరోజు వీరికి ఖర్చులు పెరుగుతుంటాయి. అనుకున్నటువంటి లాభాలు వస్తుంటాయి. అదే సమయంలో నిర్ణయాలలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నవగ్రహ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపడం మంచిది. ఆదిత్యా హృదయ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

సింహ రాశి.. ఈరోజు వీరు కుటుంబ పరమైన కార్యక్రమాలు చేపట్టి పూర్తిచేసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేసుకోవాలన్న ఆలోచనలు కలుగుతుంటాయి. పక్షులకు నీరు అందించే ప్రయత్నం చేయండి.

కన్యరాశి.. ఈరోజు వీరికి పరిశోదనలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులన్ని సకాలంలో పూర్తి చేసుకోగల్గుతారు. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

తులారాశి.. ఈరోజు వీరికి ఖర్చులు పెరుగుతుంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మహాలక్ష్మి అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి.. ఈరోజు వీరు అనవసరమైన కార్యక్రమాలను కొంత నియంత్రించుకోవాలి. పెద్దవారితో వ్యవహరించే సందర్బంలో గౌరవ మర్యాదలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శివ పంచాక్షరి జపం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి. కొన్ని శుభవార్తలు కూడా అందుకోగల్గుతారు. శివాభిషేకం మేలు చేస్తుంది.

మకర రాశి.. ఈరోజు వీరికి శ్రమ పెరుగుతుంది. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలను చేస్తుంటారు. విష్ణు సహస్ర నామా స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభ రాశి.. ఈరోజు వీరికి రావాల్సిన బాకీలు కొంత ఆలస్యం అవుతుంటాయి. ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గోంటుంటారు. దుర్గా సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.

మీనరాశి.. ఈరోజు వీరికి పెట్టుబడులు పెరుగుతుంటాయి.. అందుకోవల్సిన ప్రయోజనాలు ఆలస్యం అవుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సుదర్శన స్వామి వారి నామ స్మరణ మేలు చేస్తుంది.

Also Read: Batuk Bhairav Mandir: అక్కడ శివుడుకి పిల్లలు బిస్కెట్లు, చాక్లెట్లు సమర్పిస్తే.. పెద్దవారు మద్యం, మాంసం నైవేద్యం..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే