AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leopard: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. అలయం చుట్టూ చక్కర్లు కొడుతున్న చిరుత పులి..!

శ్రీశైలాన్ని చిరుతపులులు వదలడం లేదు. ఆలయం అడవిలో ఉండటంతో చిరుతపులులు పదేపదే ఆలయం పరిసరాల్లో తిరుగుతున్నాయి. చివరకు జనావాసాల్లోకి కూడా వస్తున్నాయి. దీంతో స్థానికంగా నివాసం ఉండే వారితోపాటు భక్తులు సైతం తీవ్ర భయాందోళనలు గురవుతున్నారు.

Leopard: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. అలయం చుట్టూ చక్కర్లు కొడుతున్న చిరుత పులి..!
Leopard
J Y Nagi Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 13, 2024 | 1:02 PM

Share

శ్రీశైలాన్ని చిరుతపులులు వదలడం లేదు. ఆలయం అడవిలో ఉండటంతో చిరుతపులులు పదేపదే ఆలయం పరిసరాల్లో తిరుగుతున్నాయి. చివరకు జనావాసాల్లోకి కూడా వస్తున్నాయి. దీంతో స్థానికంగా నివాసం ఉండే వారితోపాటు భక్తులు సైతం తీవ్ర భయాందోళనలు గురవుతున్నారు. ముఖ్యంగా చిరుతపులి సంచారంతో పాతాళగంగ మార్గంలో ఉంటున్న ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

శ్రీశైలం చుట్టూ చిరుత పులి చక్కర్లు కొడుతోంది. ఏకంగా శ్రీశైలం దేవస్థానం ఏఈవో మోహన్ ఇంట్లో చిరుత పులి కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో ఒక్కసారిగా స్థానికులతోపాటు భక్తులు ఉలికిపాటుకు గురయ్యారు.

నంద్యాల జిల్లా శ్రీశైలంలో తెల్లవారుజామున చిరుత పులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం క్షేత్రంలోని పాతాళగంగ మార్గంలోని 110 కాటేజ్‌లో దేవస్థానం ఏఈవో మోహన్ నివాసం ఉంటున్నారు. ఏఈవో ఇంటి వెనుక తెల్లవారుజామున చిరుత సంచరించింది. ఇంటి వెనుక ప్రహరీ గోడపై నడుచుకుంటూ వచ్చి గోడ దూకింది. ఇంటి పరిసరాల్లో ఉన్న ఓ కుక్కను ఎత్తుకు వెళ్ళేందుకు ప్రయత్నించింది.

కుక్క ఒక్కసారిగా గట్టిగా అరవడంతో అప్రమతమైన ఏఈవో కుటుంబసభ్యులు లైట్ వేశారు. దీంతో చిరుత పులి కుక్కను వదిలేసి ప్రహరీ గోడ దూకి పారిపోయింది. చిరుత పులి సంచారం మొత్తం ఏఈవో మోహన్ ఇంటి వెనుక ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. మంగళవారం (ఆగస్ట్ 13) తెల్లవారుజామున సుమారు 3.20 గంటల సమయంలో చిరుత పులి సంచారం కనిపించింది.

ఆలయానికి సంబంధించి కాటేజీల వద్దకు చిరుత పులి రావడంతో భయంతో వణికిపోతున్నారు స్థానికులు. జనసంచార ప్రదేశాల్లో చిరుత సంచరించడంపై స్థానికులు, భక్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీశైల క్షేత్ర పరిధి అటవీ ప్రాంతానికి దగ్గరగా చుట్టూ దట్టమైన నలమల అడవి ఉండడంతో తరచూ చిరుత పులు జనసంచారంలోకి వస్తూ అటవీ ప్రాంతంలోకి వెళ్లడం పరిపాటిగా మారింది. మరోవైపు వన్య ప్రాణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

వీడియో చూడండి…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..