Andhra News: అడవి పందుల కోసం పెట్టిన ఉచ్చు.. అందులో ఏం చిక్కిందంటే..?
కృష్ణా జిల్లాలో చిరుత పులి మృతి కలకలం రేేపుతుంది. గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మెట్లపల్లి గ్రామానికి చెందిన రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుత పులి చిక్కి మరణించింది. అయితే ఉదయాన్నే రైతు పొలానికి వెళ్లి చూడగా పులి ఉచ్చులో చిక్కి మృతి చెంది ఉంది.
గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో చిరుతపులి మృతి కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుత పులి చిక్కి మరణించింది. ఉదయాన్నే రైతు పొలానికి వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుత పులి కనిపించింది. ఇది చూసిన రైతులు, స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
తమ ప్రాంతంతో చిరుతపులి సంచరించడం..అది ఉచ్చులో చిక్కి మరణించడంతో మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా చిరుతపులులు ఉన్నాయేమోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులి మృతి ఘటన సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. దీనిపై విచారణ జరిపి వన్యప్రాణుల రక్షణతో పాటు ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి