అనంతపురంలో విషాదం.. పాము కాటుకు 8 ఏళ్ల చిన్నారి మృతి.. కన్నీరు పెట్టుకున్న టీచర్లు..

పాము కాటుతో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం అగ్రహారం గ్రామంలో...

అనంతపురంలో విషాదం.. పాము కాటుకు 8 ఏళ్ల చిన్నారి మృతి.. కన్నీరు పెట్టుకున్న టీచర్లు..
Girl
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 14, 2021 | 7:57 PM

పాము కాటుతో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం అగ్రహారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేఘన అనే 8 ఏళ్ల చిన్నారి ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. ఎప్పటిలానే స్కూల్ ఆవరణలో ఆడుకుంటుండగా ఏదో కుట్టినట్లు అనిపించడంతో.. విషయాన్ని ఉపాధ్యాయుడికి తెలియజేస్తుంది. ఆ చిన్నారిని కుట్టింది పాము అని గుర్తించడంతో.. ఉపాధ్యాయుడు హుటాహుటిన చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే మార్గం మధ్యలోనే ఆ చిన్నారి తుది శ్వాస విడిచింది. దీనితో మృతురాలి కుటుంబ సభ్యుల రోదనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, మేఘన మృతదేహానికి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు నివాళులు అర్పించారు.