AP News: ఆస్పత్రిలో వాచ్‌మెన్ వైద్యం.. ఐదుగురు స్టాఫ్ సస్పెండ్

నంద్యాల జిల్లా కొత్తబురుజు ఆస్పత్రి ఘటనపై అధికారులు సీరియస్‌ అయ్యారు. డాక్టర్ లేకపోవడంతో వాచ్‌మెన్‌ డాక్టర్ అవతారం ఎత్తారంటూ టీవీ9 ప్రసారం చేసిన కథనాలపై కలెక్టర్ రాజకుమారి స్పందించారు. ఐదుగురు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేశారు.

AP News: ఆస్పత్రిలో వాచ్‌మెన్ వైద్యం.. ఐదుగురు స్టాఫ్ సస్పెండ్
Watchmen Treatment
Follow us
J Y Nagi Reddy

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 17, 2024 | 9:48 PM

నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు విధులకు హాజరుకాకపోవడంతో వాచ్‌మెన్‌ డాక్టర్‌ అవతారమెత్తాడు. గత కొన్నిరోజులుగా వాచ్‌మెన్‌ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాడు. గర్భిణీలకు కూడా వైద్యం చేస్తున్నాడు. దీంతో ఆ ఆస్పత్రి వైపు వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. కొత్తబురుజు ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై టీవీ9 వరుస కథనాలను ప్రసారం చేసింది. వాచ్‌మెన్‌ ట్రీట్‌మెంట్ ఇస్తోన్న విజువల్స్‌ను బయటపెట్టింది.

టీవీ9 కథనాలపై నంద్యాల కలెక్టర్ రాజకుమారి స్పందించారు. కొత్తబురుజు ఆస్పత్రి ఘటనపై విచారణ జరిపారు. విధులకు హాజరుకాని ఆస్పత్రి సిబ్బందిపై వేటు వేశారు. స్టాఫ్‌నర్సు, ఫార్మాసిస్ట్, అసిస్టెంట్‌తో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్.

కొత్తబురుజు ఆస్పత్రి ఘటనతో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటిపై కలెక్టర్ దృష్టిసారించారు. వైద్యులు, వైద్య సిబ్బంది విధులకు హాజరుకాకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి