Digital Arrest: ఐటీ ఉద్యోగులు కూడా బలవుతున్నారు.. డిజిటల్ అరెస్ట్‌తో రూ. కోటి కోల్పోయిన యువతి
సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రకరకాల మార్గాల్లో అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డిజిటల్ అరెస్ట్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఏకంగా రూ. 1.25 లక్షలు పోగొట్టుకున్న ఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది..
సైబర్ నేరాలు రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను మోసం చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు. అయితే ఈ మోసాల బారిన ఏదో చదువులేని వారు మాత్రమే పడుతున్నారు అనుకుంటే పొరబడినట్లే. టెక్నాలజీపై మంచి అవగాహన ఉన్న ఐటీ ఉద్యోగులు సైతం బాధితులుగా మారడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం దేశంలో డిజిటల్ అరెస్ట్‌కు సంబంధించిన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మీకు వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్ ఉన్నాయని, డిజిటల్ అరెస్ట్ చేశామని కొందరు పోలీసుల పేరుతో పేరు చేస్తారు. ఏటూ కదలకుండా వీడియోకాల్‌లోనే ఉండాలని బెదిరిస్తారు. చివరికి డబ్బులు ఇస్తే వదిలేస్తామని బెదిరిస్తుంటారు. డిజిటల్ అరెస్ట్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే. ఈ అంశం ఎంత సీరియస్‌గా మారిందంటే. మొన్నటికి మొన్న ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్‌కీ బాత్‌లో డిజిటల్ అరెస్ట్ గురించి ప్రస్తావించారు. అయితే ఎవరెన్ని రకాలుగా అవగాహన చేపడుతున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా గుండూరుకు చెందిన ఓ యువతి ఏకంగా రూ. 1.25 కోటి పోగొట్టుకున్న సంఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది.
వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని గాయత్రి నగర్‌కు చెందిన యువతి (25) హైదరాబాద్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంటారు. ఈ క్రమంలోనే వీకెండ్ కావడంతో శుక్రవారం విజయవాడకు వచ్చారు. ఇలా ఉండగానే ఉదయం 10.30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి యువతికి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే తాము ముంబయి పోలీసులమని పరిచయం చేసుకన్నారు.
మీకు వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్ ఉన్నాయని, డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ భయపెట్టారు. ఒకవేళ అరెస్ట్ చేయొద్దంటే వెంటనే డబ్బులు చెల్లించాలని బెదిరించారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆగంతకుడు చెప్పిని అకౌంట్‌లోకి యువతి రూ. 1.25 కోట్లు పంపించారు. ఆ తర్వాత మోసపోయానని అర్థమై శుక్రవారం రాత్రి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..