Kurnool: జల్సాలకు అలవాటు పడిన యువకులు.. కార్లు అద్దె పేరుతో నయా దందా.. 21 కార్లు సీజ్..

నంద్యాల, నందికొట్కూరు లకు చెందిన ఇద్దరు యువకులు జల్సా లకు అలవాటు పడ్డారు. వీరు కష్టపడకుండా డబ్బుల సంపాదన కోసం కొత్త ప్లాన్ వేశారు. తర్వాత పోలీసుల చేతికి చిక్కారు. నంద్యాల నందికొట్కూరు కు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి కోటి రూపాయలకు పైగా విలువైన 21 కార్లు సీజ్ చేశారు

Kurnool: జల్సాలకు అలవాటు పడిన యువకులు.. కార్లు అద్దె పేరుతో నయా దందా.. 21 కార్లు సీజ్..
Car Rental Cheating
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 21, 2023 | 2:45 PM

ఇదో కొత్త రకం మోసం. కారును అద్దెకు తీసుకుని ఆ తర్వాత డబ్బులకు కొదువ పెడుతున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ కేటుగాళ్లు తాజాగా పోలీసుల చేతికి చిక్కారు.  దీంతో నంద్యాల జిల్లాలో కారు అద్దెకు ఇవ్వాలంటే యజమానులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇంతకు ఈ కొత్త రకం మోసం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నంద్యాల, నందికొట్కూరు లకు చెందిన ఇద్దరు యువకులు జల్సా లకు అలవాటు పడ్డారు. వీరు కష్టపడకుండా డబ్బుల సంపాదన కోసం కొత్త ప్లాన్ వేశారు. తర్వాత పోలీసుల చేతికి చిక్కారు. నంద్యాల నందికొట్కూరు కు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి కోటి రూపాయలకు పైగా విలువైన 21 కార్లు సీజ్ చేశారు

నంద్యాల సాయిబాబా నగర్ కు చెందిన షేక్ అన్సార్ హుస్సేన్ జల్సా రాయుడు. డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఒక కారు యజమాని దగ్గర డ్రైవర్ గా పని చేశాడు. జల్సాలకు అలవాటు పడి అడ్డదారిలో నడవడం మొదలు పెట్టాడు. కారుకి ఒక నెల అద్దెకి కావాలంటూ తీసుకెళ్తాడు. అదే కారును ఇతరుల వద్ద కుదువబెట్టి డబ్బులు తీసుకుంటారు. ఇలా నంద్యాలలోని దాదాపు 13 కార్లు అద్దె రూపంలో తీసుకొని వడ్డీ వ్యాపారుల దగ్గర కుదువ పెట్టాడు. ఎంతకీ కారు తెచ్చి ఇవ్వకపోవడంతో చంద్రపాల్ అనే కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు తీగ లాగితే డొంక కదిలింది మొత్తం 13 కార్లు కుదువ పెట్టి 23 లక్షలు అప్పు తీసుకున్నట్లు తేలింది. 13 కారులను సీజ్ చేసి హుస్సేన్ ను అరెస్టు చేసినట్లు నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు..

ఇవి కూడా చదవండి

నంద్యాల సంగతి ఇలా ఉంటే నందికొట్కూరులో కూడా ఇదే తరహా మోసం వెలుగు చూసింది. సయ్యద్ జావిద్ భాష ది ఆత్మకూరు మండలం వెంకటాపురం. నందికొట్కూరు లోనే ఉంటుంటాడు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడి అప్పుల పాలయ్యాడు. కార్లను అద్దెకిచ్చే వారితో సన్నిహితంగా మెలిగి.. అద్దె కోసం అని చెప్పి వారి కార్లు తీసుకొని తిరిగి రాలేదు. మొత్తం 8 కార్లు కుదువ పెట్టి పెద్ద ఎత్తున అప్పు తీసుకున్నాడు. కారు లేదు డబ్బులు లేదు దీంతో యజమానులు ఫిర్యాదు చేశారు. సయ్యద్ భాషాను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. 60 లక్షల విలువైన ఎనిమిది కార్లు సీజ్ చేశారు. మొత్తం మీద అటు నంద్యాల ఇటు నందికొట్కూరులో 21 కార్లు సీజ్ చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. కారు యజమానులు తమ వాహనాన్ని అద్దెకి ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..