Railways: రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్‌.. 20 రూపాయలకే పసందైన భోజనం.

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని రైల్వే స్టేషన్స్‌లో తక్కు ధరలో ఆహారాన్ని అందిస్తున్నారు. జనరల్‌ కోచ్‌లలో ప్రయాణించే వారికి లాభం చేకూర్చే ఉద్దేశంతో నాణ్యమైన ఎకానమీ మీల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మీల్స్‌లో రెండు రకాల భోజనాన్ని అందిస్తున్నారు. ఎకానమీ భోజనం రూ. 20 కాగా, కాంబో భోజనం రూ. 50గా నిర్ణయించారు...

Railways: రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్‌.. 20 రూపాయలకే పసందైన భోజనం.
Railways
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 21, 2023 | 2:34 PM

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని రైల్వే స్టేషన్స్‌లో తక్కు ధరలో ఆహారాన్ని అందిస్తున్నారు. జనరల్‌ కోచ్‌లలో ప్రయాణించే వారికి లాభం చేకూర్చే ఉద్దేశంతో నాణ్యమైన ఎకానమీ మీల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మీల్స్‌లో రెండు రకాల భోజనాన్ని అందిస్తున్నారు. ఎకానమీ భోజనం రూ. 20 కాగా, కాంబో భోజనం రూ. 50గా నిర్ణయించారు. ఈ మీల్స్‌ రైల్వే స్టేషన్స్‌లో ఉండే ఇండియన్‌ రైల్వే టూరిజం అండ్‌ క్యాటరింగ్ సర్వీస్‌ (ఐఆర్‌సీటీసీ)కి చెందిన కిచెన్‌ యూనిట్లు, జన్‌ ఆహార్‌ సర్వీస్‌ కౌంటర్లలో లభిస్తాయి.

జనరల్‌ కోచ్‌లు ఆగే ప్రదేశంలో ప్లాట్‌ఫామ్‌పై ఈ సర్వీస్‌ కౌంటర్లు ఉంటాయి. ఎక్కువ మంది ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేశారు. ఈ ఎకానమీ మీల్స్‌ను తొలుత హైదరాబాద్‌, విజయవాడ, రేణిగుంట, గుంతకల్‌ రైల్వే స్టేషన్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలు ఈ నాలుగు స్టేషన్స్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయ్‌. జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి సరసమైన ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. భోజనం మెనులో సౌత్‌ ఇండియన్‌ వంటకాలు కూడా ఉన్నాయి.

ఈ ఎకానమీ భోజనం ప్రయాణిలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ. అరుణ్‌ కుమార్‌ జైన్‌ అన్నారు. దీనిద్వారా ప్రయాణికులు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని పొందగలరన్నారు. ప్రస్తుతం నాలుగు స్టేషన్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు భవిష్యత్తులో ఇతర స్టేషన్స్‌లోనూ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!