TS Police Jobs: తెలంగాణ పోలీస్‌ అభ్యర్ధులకు అలర్ట్.. ఫలితాల్లో ర్యాంకు ఎంత ఉన్నా వీరికి మాత్రం కొలువు దక్కదు

వయసులో ఉన్నప్పుడు ఆకతాయి తనంతోనో, మరేదైనా కారణంతోనో తెలిసోతెలియకో చేసిన నేరం వల్ల ఒక్కసారి పోలీస్‌ స్టేషన్‌లో కేసు ఫైల్‌ అయితే ఇక వారి కెరీర్‌ అంతటితో ముగిసిపోయినట్లే. ఎందుకంటే డిగ్రీలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఎంపికైన వారి గురించి..

TS Police Jobs: తెలంగాణ పోలీస్‌ అభ్యర్ధులకు అలర్ట్.. ఫలితాల్లో ర్యాంకు ఎంత ఉన్నా వీరికి మాత్రం కొలువు దక్కదు
Telangana Police Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 21, 2023 | 1:58 PM

హైదరాబాద్‌, జులై 21: వయసులో ఉన్నప్పుడు ఆకతాయి తనంతోనో, మరేదైనా కారణంతోనో తెలిసోతెలియకో చేసిన నేరం వల్ల ఒక్కసారి పోలీస్‌ స్టేషన్‌లో కేసు ఫైల్‌ అయితే ఇక వారి కెరీర్‌ అంతటితో ముగిసిపోయినట్లే. ఎందుకంటే డిగ్రీలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఎంపికైన వారి గురించి అధికారులు విచారణ చేపడతారు. ఒకవేళ వారిపై కేసు ఉన్న సంగతి వెల్లడైతే సర్కార్ కొలువు దక్కదు. పోలీసు నియామక పరీక్షల్లో ఎంపికైన వారిలో కనీసం 100 మంది వరకూ ఇలాంటి కారణాల వల్లనే ఉద్యోగం కోల్పోతున్నారు. ఒక్కసారి పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైతే పాస్‌పోర్టు కూడా రాదన్న సంగతి చాలామందికి తెలియడంలేదు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనప్పుడు నేరచరిత్ర ఉంటే వారిని తిరస్కరిస్తారు. చివరి దశలో ఉద్యోగ తిరస్కారానికి గురయ్యే వరకూ చాలామందికి తామ తప్పేంటో తెలియడంలేదు.

రాంగ్‌రూట్లో ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే ఎక్కడలేని కోసం ముంచుకొస్తుంది. ప్రశ్నించినవారిపై దాడికి తెగబడతారు. ఎస్సార్‌నగర్‌లో బోనాల ఊరేగింపు సమయంలో కొందరు యువకులు ఒకరిపై ఒకరు బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు. హైదరాబాద్‌ శివార్లలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో సీనియర్లు, జూనియర్లు కొట్టుకుని ఒకరినొకరు గాయపరచుకున్నారు. ఇటువంటి పలు నేరాల్లో పోలీసు కేసులైతే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోంది. గత ఏడాది తెలంగాణలో మొత్తం 7,66,536 కేసులు నమోదవగా వాటిల్లో 90 శాతం నిందితులు యువకులే ఉంటున్నారు. ఇలా పలు కేసుల్లో నిందితులుగా బుక్కైన వారిపై కేసు కొట్టేసే వరకూ సర్వీసు రెగ్యులర్‌ చేయరు.

ఒకవేళ శిక్షపడితే ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిస్తారు. ఇక పోలీసుల కొలువులకు ఎంపికైన వారిలోనైతే ప్రతి బ్యాచ్‌లో కనీసం 100 మందిపైనా కేసులు ఉన్నవారు ఉంటున్నారు. మొత్తం ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక చివరి దశలో జరిగే విచారణలో వీరిపై ఉన్న కేసుల సంగతి బయటపడుతోంది. దీంతో పోలీసుకొలువు ఇవ్వడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. ఒక్కసారి పోలీసు కేసు నమోదైతే ఆ మచ్చ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.