AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palnadu: శివాలయం దగ్గర్లోని పొదల మధ్య మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని వెళ్లి చూడగా..

భైరవునిపాడు గ్రామంలో అరుదైన పురాతన విగ్రహం బయల్పడింది. గృహ పూజల కోసం ఉద్దేశించిన వీరభద్రుని అందమైన సూక్ష్మ శిల్పం పాత శివాలయానికి సమీపంలోని పొదల్లో లభ్యమైంది. స్థానిక వ్యక్తి ఆ విగ్రహాన్ని జాగ్రత్తపరిచారు. తాజాగా పురావస్తు శాస్త్రవేత్త శివనాగిరెడ్డి ఆ విగ్రహాన్ని పరిశీలించారు.

Palnadu: శివాలయం దగ్గర్లోని పొదల మధ్య మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని వెళ్లి చూడగా..
Shiva Temple (Representative image )
Ram Naramaneni
|

Updated on: May 16, 2025 | 12:10 PM

Share

పల్నాడు జిల్లా మాచర్ల మండలం భైరవునిపాడు గ్రామంలో అరుదైన పురాతన విగ్రహం బయటపడింది. స్థానిక పురాతన శివాలయం సమీపంలోని పొదల్లో సగం పూడ్చబడిన 16వ శతాబ్దానికి చెందిన వీరభద్రుడి అందమైన చిన్న శిల్పం లభ్యమైందని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ పురావస్తు శాస్త్రవేత్త, సీఈవో డాక్టర్ ఈ శివనాగిరెడ్డి తెలిపారు.

స్థానిక నివాసి మున్నంగి జగన్నాధం ఇచ్చిన సమాచారం ఆధారంగా శివనాగిరెడ్డి మంగళవారం 6 అంగుళాల పొడవు, 12 అంగుళాల ఎత్తు, 2 అంగుళాల మందం కలిగిన ఆ విగ్రహాన్ని పరిశీలించారు. వీరభద్రుడు కుడి చేతితో బాణం, కత్తి.. ఎడమ చేతిలో విల్లు, డాలు పట్టుకుని ఉన్నట్లు ఈ విగ్రహాన్ని చెక్కారు. వీరభద్రుడు త్రిభంగలో పీఠంపై నిలబడి ఉండటం విలక్షణమైన విజయనగర ఐకానోగ్రఫీ, కళా శైలిని సూచిస్తుందని శివనాగిరెడ్డి చెప్పారు. చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత ఉన్న శిల్పాన్ని జాగ్రత్త చేసి..  స్థానిక పాత శివాలయంలో దానిని భద్రపరిచినందుకు  మున్నంగి జగన్నాధంను అభినందించారు. దానిని భావితరాల కోసం సంరక్షించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో బుద్ధవనం ప్రాజెక్టు డిజైన్ ఇన్‌చార్జ్ డి.ఆర్. శ్యాంసుందర్‌రావు పాల్గొన్నారు. 

Miniature Unearthed

Miniature Unearthed

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.   

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్