మత్తు డ్రైవర్లు ఇక జైలుకే..!
మద్యం మత్తులో డ్రైవింగ్ చేసే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్లకు నందిగామ కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఇక నుంచి మద్యం తాగి పట్టుబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లకి పది రోజుల జైలు శిక్షతో పాటు వారి లైసెన్స్‌ని రద్దు చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి ఆకుల సత్యనారాయణ తీర్పు చెప్పారు. ఇటీవలే డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులకు మత్తులో డ్రైవింగ్ బాబులు బాగానే పట్టుబడ్డారు. ఈ రోజు కూడా మరో డ్రైవర్ మద్యం సేవించి, డ్రైవింగ్ చేస్తుండగా […]
మద్యం మత్తులో డ్రైవింగ్ చేసే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్లకు నందిగామ కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఇక నుంచి మద్యం తాగి పట్టుబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లకి పది రోజుల జైలు శిక్షతో పాటు వారి లైసెన్స్‌ని రద్దు చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి ఆకుల సత్యనారాయణ తీర్పు చెప్పారు. ఇటీవలే డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులకు మత్తులో డ్రైవింగ్ బాబులు బాగానే పట్టుబడ్డారు. ఈ రోజు కూడా మరో డ్రైవర్ మద్యం సేవించి, డ్రైవింగ్ చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికాడు. దీంతో ఇతనిపైనే కాకుండా.. ఇకపై దొరికే వారికి ఇలాంటి శిక్షలు పడతాయని నందిగామ కోర్టు హెచ్చరించింది.