AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bunny Festival: రక్తమోడిన దేవరగట్టు కర్రల సమరం.. పగిలిన 70 తలలు.. ఇద్దరి పరిస్థితి విషమం.. 17 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి

మాలమల్లేశ్వర స్వామి వారిని తీసుకుని వెళ్లేందుకు అనేక ప్రజలు అర్ధరాత్రి సమయంలో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నార. స్వామివారికోసం ఇరువర్గాలు కర్రలతో కొట్టుకున్నారు.  సంప్రదాయ ఉత్సవం పేరుతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.

Bunny Festival: రక్తమోడిన దేవరగట్టు కర్రల సమరం.. పగిలిన 70 తలలు.. ఇద్దరి పరిస్థితి విషమం.. 17 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి
Devaragattu Bunny Festival
Surya Kala
|

Updated on: Oct 06, 2022 | 7:30 AM

Share

దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా దేవర గట్టులో జరిగే కర్రల సమరం మరోసారి రక్తసిక్తమైంది. సుమారు రెండు గంటల పాటు కురిసిన జోరు వానలో కూడా బన్నీ ఉత్సవం ఓ రేంజ్ లో సాగింది. మాలమల్లేశ్వర స్వామి విగ్రహం కోసం రెండు వర్గాలకు చెందిన వేలాది మంది ఎప్పటిలాగానే కర్రలతో కొట్టుకున్నారు. మాలమల్లేశ్వర స్వామి వారిని తీసుకుని వెళ్లేందుకు అనేక ప్రజలు అర్ధరాత్రి సమయంలో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నార. స్వామివారికోసం ఇరువర్గాలు కర్రలతో కొట్టుకున్నారు.  సంప్రదాయ ఉత్సవం పేరుతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో 70 మందికి పైగా గాయపడ్డారు. తలలు పగిలాయి. గాయపడిన భక్తులకు అక్కడిక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో చికిత్సనందించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే గాయపడిన వారి వివరాలను వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. ఆసుపత్రి వద్దకు మీడియాకు పోలీసులు అనుమతినివ్వలేదు.

ఈ సాంప్రదాయ ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా భక్తుల హింసాత్మక ధోరణిని మాత్రం అడ్డుకోలేకపోయారు. ఉత్సవాలను చూడడానికి భారీ సంఖ్యలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు హాజరయ్యారు. ఉత్సవాన్ని తిలకించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన కర్నాటక లో మాడ సుగురూ గ్రామానికి చెందిన రవీంద్రరెడ్డి గుండె పోటుతో (17) మృతి చెందారు.

ఈ కర్రల సమరం విషయంలో సుమారు 40 గ్రామాల ప్రజలకు , స్వామి వారి భక్తుల్లో చైతన్యం తీసుకు వచ్చేనందుకు ఎప్పటినుంచో ప్రభుత్వ అధికారులు, స్వచ్చంద సంఘాలు అనేక  కార్యక్రమాలు కొన్నేళ్లుగా చేపడుతున్నారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితాలను ఇవ్వడంలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!