ప్రముఖ గాయని వింజమూరి అనసూయదేవీ అస్తమయం
అమెరికా: ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని, దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు వింజమూరి అనసూయదేవి(99) అమెరికాలోని హ్యుస్టన్‌లో కన్నుమూశారు. 1920 మే 12న కాకినాడలో ఆమె జన్మించారు. అనసూయా దేవికి ఐదుగురు సంతానం. ఆలిండియా రేడియో ద్వారా తెలుగు జానపద గీతాలకు అనసూయా దేవి ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. జానపద గేయాల సేకరణ, బాణీలు కట్టడంలో ఈమెది అందెవేసి చెయ్యిగా ప్రాచుర్యం పొందారు. ఆంధ్రా వర్సిటీ నుంచి కళాప్రపూర్ణ, డాక్టరేట్‌ను వింజమూరి అందుకున్నారు.