అమెరికాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

అమెరికాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. మిడ్‌వెస్ట్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో మిడ్‌వెస్ట్ యూఎస్ ప్రాంతమంతా వరదనీటిలో మునిగిపోయింది. సమీపప్రాంతాల్లోని పంటపొలాలు, రైలు పట్టాలన్నీ వరదనీటిలో మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. నివాస ప్రాంతాల్లోకి కూడా వరదనీరు పోటెత్తడంతో చాలా ఇళ్లు మునిగిపోయాయి. వరద బాధితులను ఆదుకునేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరదనీటిలోని బోటుపై ప్రయాణిస్తూ బాధితులను రక్షిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. […]

అమెరికాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Mar 27, 2019 | 5:41 PM

అమెరికాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. మిడ్‌వెస్ట్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో మిడ్‌వెస్ట్ యూఎస్ ప్రాంతమంతా వరదనీటిలో మునిగిపోయింది. సమీపప్రాంతాల్లోని పంటపొలాలు, రైలు పట్టాలన్నీ వరదనీటిలో మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. నివాస ప్రాంతాల్లోకి కూడా వరదనీరు పోటెత్తడంతో చాలా ఇళ్లు మునిగిపోయాయి.

వరద బాధితులను ఆదుకునేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరదనీటిలోని బోటుపై ప్రయాణిస్తూ బాధితులను రక్షిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు.

అలాగే.. అటు టెక్సస్‌లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. విపరీతమైన వేగంతో వడగళ్లు పడటంతో కార్లు ధ్వంసం అయ్యాయి. రోడ్లన్నీ వడగళ్లలో నిండిపోయాయి. ఎటు చూసినా మంచు ముద్దలే కనిపిస్తుననాయి. గంటలకు 60 మైళ్ల వేగంతో వడగళ్లు పడుతుండటంతో జనం భయపడుతున్నారు.