Arizona Wildfire: ఆరిజోనాను వణికిస్తున్న కార్చిచ్చు.. కార్చిచ్చుకు 25 ఇళ్ల, భవనాలు దగ్దం..
అమెరికాలోని అరిజోనా స్టేట్‌ను(Arizona wildfire) కార్చిచ్చు వణికిస్తోంది. పెద్దఎత్తున ఇళ్లు డజన్లసంఖ్యలో తగలబడ్డాయి. ఈదురుగాలులు వీయడంతో దావానలం వ్యాప్తి తీవ్రంగా ఉంది. దీంతో ప్రాణభయంతో వేలాది జనం..
అమెరికాలోని అరిజోనా స్టేట్‌ను(Arizona wildfire) కార్చిచ్చు వణికిస్తోంది. పెద్దఎత్తున ఇళ్లు డజన్లసంఖ్యలో తగలబడ్డాయి. ఈదురుగాలులు వీయడంతో దావానలం వ్యాప్తి తీవ్రంగా ఉంది. దీంతో ప్రాణభయంతో వేలాది జనం ఈ ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. తమ పెంపుడు జంతువులను కూడా తరలిస్తున్నారు. ఆరిజోనాలోని నార్త్ ఫ్లాగ్‌స్టాప్ పట్టణానికి 14 మైళ్ల దూరంలోని దాదాపు 20 వేల ఎకరాల అడవులను దహించేసింది ఈ కార్చిచ్చు.. ఎగిసిపడుతున్న మంటలు జనావాసాలకు కూడా వ్యాపించాయి,, దాదాపు 25 ఇళ్లు, భవనాలను మంటలు దహించేశాయి.. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంద పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు.. ఈదురు గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.
అమెరికాలో ప్రతిఏటా ఈ సీజన్‌లో అరిజోనా, న్యూ మెక్సికో, కొలరాడో రాష్ట్రాల్లో విస్తరించిన సతత హరితారణ్యాలు ఎండిపోతాయి.. ఈ అడవులు కొద్దిపాటి మంటలకే అంటుకొని వేలాది ఎకరాలకు వ్యాపిస్తుంటుంది.. తాజాగా ఆరిజోనాలో కరువు పరిస్థితులు కార్చిచ్చుకు కారణమయ్యాయంటున్నారు అధికారులు.
ఇవి కూడా చదవండి: AP: ఫీజు కట్టాలంటూ అందరి ముందు అవమానించారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారులు..