నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా…? ఈ వీడియోలో కనిపిస్తుంది నిజమేనా..?.. అమెరికా నుంచి వీడియో విడుదల
Leaked footage: ప్రపంచంలో అమెరికా దగ్గర ఉన్నంత టెక్నాలజీ మరే ఇతర దేశాల దగ్గర లేదనే చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీ నుంచి ఇతర దేశాలు తప్పించుకోవడం అంత సులభం..
Leaked footage: ప్రపంచంలో అమెరికా దగ్గర ఉన్నంత టెక్నాలజీ మరే ఇతర దేశాల దగ్గర లేదనే చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీ నుంచి ఇతర దేశాలు తప్పించుకోవడం అంత సులభం మాత్రం కాదు. ఇప్పుడు ఈ టెక్నాలజీ నుంచి ఏలియన్స్ కూడా తప్పించుకోలేకపోయాయి. ఏలియన్స్ సంబంధించి ఓ వీడియో లీకై ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో అమెరికా నౌకాదళ అధికారులు ఓ యుద్ధ నౌక నుంచి తీశారు. అందులో త్రిభుజ ఆకారంలో ఉన్న రెండు ఎగిరేపళ్లాలు వేగంగా వెళ్లాయి.
ఈ వీడియోను గ్రహాంతరవాసులపై అధ్యయనం చేస్తున్నవారు విడుదల చేశారు. దీనిపై అమెరికా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ దీనిపై స్పందించింది. లీకైన ఫోటోలు, వీడియోలను అమెరికా నేవీ దళ సిబ్బంది తీశారని తెలిపింది. అయితే వాటిలో ఉన్న యూఎఫ్‌ఓలే అని మాత్రం చెప్పలేదు. యుఎస్‌ఏ టుడే ప్రకారం.. యుఎస్ ప్రభుత్వం యుఎఫ్‌ఓల గురించి వివరణాత్మక నివేదికను జూన్ 1న విడుదల చేస్తుందని వారు భావిస్తున్నారు.
ఈ వీడియోలు, ఫోటోలను 2020 మే 1న నేవీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి లీకయ్యాయి. గత రెండు సంవత్సరాలుగా పెంటగాన్ అధికారులు ఏలియన్స్ ఉన్నాయి అనేలా చెబుతున్నాయి. కానీ డైరెక్టుగా గ్రహాంతర వాసులు ఉన్నారు అని మాత్రం ఎక్కడ వెల్లడించలేదు. రకరకాల వీడియోల్లో కనిపిస్తూ అకస్మాత్తుగా మాయమవుతున్న ఆ విచిత్రమైన వస్తువులు ఏంటన్నది ఎవరికి అంతుపట్టడం లేదు. దీనిపై పెంటగాన్ వాస్తవాలు బయట పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
View this post on Instagram