Corona Pandemic: వేగంగా పెరుగుతున్న కరోనా మరణాలు.. ప్రపంచంలో నాలుగో స్థానంలో భారత్!
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల లెక్కలు చూస్తే మతిపోవడం ఖాయం. పైగా ఈ లెక్కలు ఇప్పటి కరోనా తీవ్రతను స్పష్టం చేస్తాయి. ప్రస్తుతం చాపకింద నీరులా కరోనా వైరస్ ఎంతగా ప్రపంచంలో ప్రజల ప్రాణాలు లాగేస్తోందో అర్ధం అవుతుంది.
Corona Pandemic: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల లెక్కలు చూస్తే మతిపోవడం ఖాయం. పైగా ఈ లెక్కలు ఇప్పటి కరోనా తీవ్రతను స్పష్టం చేస్తాయి. ప్రస్తుతం చాపకింద నీరులా కరోనా వైరస్ ఎంతగా ప్రపంచంలో ప్రజల ప్రాణాలు లాగేస్తోందో అర్ధం అవుతుంది. ఇప్పుడు కరోనా మరణాలు మూడు మిలియన్లు (30 లక్షలు) మార్కు చేరిపోయాయి. ఇక్కడ చెప్పుకోవలసిన అంశం ఏమిటంటే.. గత సెప్టెంబర్ నెల 28వ తేదీ వరకూ ఒక్క మిలియన్ (పదిలక్షలు) మరణాలు కూడా పూర్తిగా రికార్డు కాలేదు. కానీ, ఈ ఏడు నెలల్లోనే మూడు మిలియన్లకు చేరిపోయింది మరణాల సంఖ్య. అందులోనూ ఫిబ్రవరి 21 నాటికి ఈ లెక్క రెండు మిలియన్లె. అంటే.. మొదటి మిలియన్ మరణాలకు దాదాపుగా సంవత్సరం తీసుకుంటే.. రెండో మిలియన్ మరణాలకు ఐదు నెలలు తీసుకుంటే.. మూడో మిలియన్ రికార్డు కావడానికి కేవలం రెండు నెలలే పట్టింది. దీనిని బట్టి కరోనా రెండో వేవ్ ఎంతగా ప్రజల ప్రాణాలను చప్పుడు చేయకుండా పట్టుకుపోతోందో తెలియడానికి. ప్రపంచ దేశాలు ఎంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెట్టి వేగంగా టీకాలు వేసేస్తున్నా..అంతకంటే వేగంగా కరోనా ప్రాణాలు తీసేస్తోంది. అమెరికా, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో కోవిడ్ మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేవి. కానీ.. ఇండియాలో గతంలో చాలా తక్కువ ఉండేవి. అయితే, కొన్నివారాలుగా పరిస్థితిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ కూడా మరణాల సంఖ్యా వేగంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాల పరిస్తితిని చూస్తె కనుక…
అమెరికాలో.. మరణాల సంఖ్యలో అమెరికా టాప్ ప్లేస్ లో ఉంది. మొత్తం 5,64,800 కరోనా మరణాలు అక్కడ ఇప్పటివరకూ సంభవించాయి. అంటే ప్రతి 567 మందిలో ఒకరు మృత్యువాత పడ్డారు. అక్కడ పరిస్థితి ఇలా కావడానికి అక్కడి పాలకులు కూడా మొదట్లో కరోనాను లైట్ తీసుకోవడమే. కరోనా మొదటసారి వచ్చినపుడు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కనీసం తాను ఏరోజూ మాస్క్ ధరించలేదు. అంత నిర్లక్ష్యానికి అమెరికా భారీ మూల్యమే చెల్లించింది.
బ్రెజిల్ లో.. ఇక్కడ అమెరికా తరువాత ఎక్కువగా మరణాలు చోటుచేసుకున్నాయి. మొత్తం 3,68,749 మంది కరోనాతో చనిపోయారు. మొదట్లోనే ఇక్కడ ఎక్కువగా మరణాలు రికార్డు అయ్యాయి. ప్రతి నలుగురిలో ఒకరు కరోనాతో మృత్యువాత పడ్డారు. రెండో వేవ్ లో ఈ సంఖ్య బాగా తగ్గింది. అమెరికాలో ట్రంప్ లానే ఇక్కడ కూడా అధ్యక్షడు జేయిర్ బోల్సోనారో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. లాక్ డౌన్ విధించడానికి కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో జనం చచ్చిపోయారు. ఆయన కరోనాను జస్ట్ ఫ్లూ.. వస్తుంది పోతుంది అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు నష్టాన్ని ప్రజలు భరించాల్సి వచ్చింది. ప్రస్తుత లెక్కల ప్రకారం బ్రెజిల్ లో జూలై నాటికి కరోనా మరణాలు ఐదు లక్షలకు చేరతాయి.
మెక్సికోలో.. ఇక మరణాల సంఖ్యలో మూడో అతిపెద్ద దేశం మెక్సికో. ఇక్కడ 2,11,693 మంది మరణించారు. ఇక్కడ కరోనా టెస్ట్ లు తక్కువగా జరిగాయి. ఒకవేళ టెస్ట్ లు ఎక్కువగా జరిగి ఉంటె ఈ సంఖ్య 3,30,000గా రికార్డు అయ్యేదని అక్కడ పరిశోధకులు చెబుతారు.
ఇండియా లో.. ఇప్పటివరకూ 1,75,649 మరణాలతో ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరింది ఇండియా. ఇక్కడ కరోనా మరణాల సంఖ్య పెద్దదిగా కనిపిస్తున్నా.. మిగిలిన దేశాల జనాభా.. మరణాలు నిష్పత్తితో పోలిస్తే ఇది తక్కువే. కరోనా మరణాలను లెక్కించే విధానాన్ని ఇన్ఫెక్షన్ ఫేటాలిటీ రేట్ (ఐఎఫ్ఆర్) గా లెక్కిస్తారు. ఈ లెక్కన చూస్తే మనదేశపు లెక్క 0.08శాతం మాత్రమె. మొత్తంగా వైరస్ సోకిన వ్యక్తులు మరణించిన వ్యక్తుల నిష్పత్తి ఈ లెక్క. ఈ లెక్క ప్రకారం చూస్తె అమెరికా ఐఎఫ్ఆర్ 0.6శాతం. ఇండియాకంటే ఎనిమిది రెట్లు ఎక్కువ.
Also Read: Corona Pandemic: దేశవ్యాప్తంగా కరోనా నిబంధనలు ఎక్కడెక్కడ..ఎలా ఉన్నాయంటే..!
Corona Virus: కొత్త భయం.. కోవిడ్ ఉన్నా..ఆర్‌టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్! ఎందుకలా?