వ్యాక్సిన్, ఆక్సిజన్ కొరత రానివ్వద్దన్న మోదీ.. కరోనా నియంత్రణ చర్యలపై ప్రధాని అత్యవసర సమీక్ష
కరోనా వైరస్ చుక్కలు చూపిస్తోంది. సెకండ్ వేవ్‌లో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్ కట్టడి నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు.
PM Narendra Modi Review: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చుక్కలు చూపిస్తోంది. సెకండ్ వేవ్‌లో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్ కట్టడి నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. వైరస్‌కు ఎలా అడ్డుకట్ట వేయాలి ? వ్యాక్సిన్ కొరతను ఎలా అధిమించాలి ? ఆక్సిజన్ సరఫరా ఎలా పెంచాలన్న విషయంపై ప్రధాని మోదీ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు.
కరోనా నియంత్రణకు తీసుకోవల్సిన చర్యలపై ప్రధాని మోదీ.. వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. మహారాష్ట్ర , ఢిల్లీ , ఉత్తరప్రదేశ్ , చత్తీస్‌ఘడ్ పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరించడంపై ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సంక్రమణకు ఎలా అడ్డుకట్టాలన్న విషయంపై చర్చించారు. వ్యాక్సినేషన్‌పై కూడా అధికారులతో కీలక చర్చలు జరిపారు మోదీ. ముఖ్యంగా 45 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లకు కూడా టీకా ఇచ్చే విషయంపై చర్చించారు.
PM interacts with the Governors on Covid-19 situation and Vaccination Drive in the country. https://t.co/9KwHDjmW43
via NaMo App pic.twitter.com/pnjE2QFccd
— PMO India (@PMOIndia) April 14, 2021
అలాగే, తమ దగ్గర వ్యాక్సిన్ నిల్వలు లేవని, ఆక్సిజన్‌తో పాటు రెమిడెసివర్ మందుల కొరత తీవ్రంగా ఉందని, చాలా రాష్ట్రాలు ప్రధానికి లేఖ రాశాయి. ఈ విషయంపై కూడా ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించారు. వ్యాక్సిన్లకు ఎలాంటి కొరత లేకుండా చూడాలని అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు. మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా , రాహుల్ వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రజలందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుంటే, మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తీరును ఈవిషయంలో తప్పు పడుతోంది. యాంటీ వైరల్ డ్రగ్ ‘రెమ్‌డిసివిర్’ను మహారాష్ట్రకు సరఫరా చేయవద్దంటూ తయారీ కంపెనీలకు కేంద్రం గట్టి హెచ్చరికలు చేసినట్టు ఆ రాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణ చేశారు.
కరోనా నియంత్రణకు అవసరమైతే మరిన్ని ఆంక్షలు విధించాలని కూడా ప్రధాని మోదీ ఈ సమావేశంలో సూచించారు. సెకండ్ వేవ్ విజృంభణపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ప్రధాని మోదీ పలుమార్లు చర్చించారు. అలాగే, రాష్ట్రాల గవర్నర్లతో కూడా తాజాగా సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్లు, ఆక్సిజన్ నిల్వలు , రెమిడెసివర్ మందుల కొరత లేకుండా చూడాలని ఈ సమావేశంలో ప్రధాని మోదీ కోరారు.
Read Also… Corona Pandemic: దేశవ్యాప్తంగా కరోనా నిబంధనలు ఎక్కడెక్కడ..ఎలా ఉన్నాయంటే..!