ఇండియా కరోనా బులిటెన్.. దేశంలో కొత్తగా పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్ని నమోదయ్యాయంటే.?
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,567 పాజిటివ్ కేసులు, 385 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 97,03,770కు చేరింది.
Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,567 పాజిటివ్ కేసులు, 385 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 97,03,770కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 3,86,866 ఉండగా.. ఇప్పటివరకు 91,78,946 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న దేశవ్యాప్తంగా 385 మంది మృతి చెందటంతో మొత్తం ఇప్పటివరకు వైరస్ కారణంగా 1,40,958 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే దాదాపు ఐదు నెలల తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య ఇంత తక్కువగా నమోదైందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో తప్పితే మిగిలిన చోట్ల పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 39,045 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. అటు నిన్న 10,26,399 టెస్టులు చేయగా.. మొత్తం దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య 14,88,14,095కు చేరింది. దేశంలో 94.59 శాతానికి రికవరీ రేటు చేరిందంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 3.96 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది.
?#COVID19 India Tracker (As on 8 December 2020, 08:00 AM)
➡️Confirmed cases: 97,03,770 ➡️Recovered: 91,78,946 (94.59%)? ➡️Active cases: 3,83,866 (3.96%) ➡️Deaths: 1,40,958 (1.45%)#IndiaFightsCorona#Unite2FightCorona#StaySafe pic.twitter.com/eEB1fq9KSU
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) December 8, 2020