AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lady Gaga’s Bull Dogs: ఆ కుక్కలు రెండూ ఆమె వద్దకే చేరాయ్, లేడీ గాగా ఖుషీ, బుల్ డాగ్స్ ‘కథ సుఖాంతం’ !

Lady Gaga's Bull Dogs: అమెరికాలో పాప్ సింగర్ లేడీ గాగా ఎంతగానో అభిమానించే రెండు శునకాలు సేఫ్ గా ఆమె వద్దకు చేరాయి. రెండు రోజుల క్రితం వీటిని దొంగలు అపహరించుకుపోయారు..

Lady Gaga's Bull Dogs: ఆ కుక్కలు రెండూ ఆమె వద్దకే చేరాయ్, లేడీ గాగా ఖుషీ, బుల్ డాగ్స్ 'కథ సుఖాంతం' !
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 28, 2021 | 10:23 AM

Share

Lady Gaga’s Bull Dogs: అమెరికాలో పాప్ సింగర్ లేడీ గాగా ఎంతగానో అభిమానించే రెండు శునకాలు సేఫ్ గా ఆమె వద్దకు చేరాయి. రెండు రోజుల క్రితం వీటిని దొంగలు అపహరించుకుపోయారు. కోజీ, గుస్తావ్ అనే పేర్లు గల ఈ కుక్కలను ఈ నెల 25 న లేడీ గాగా కార్యాలయ ఉద్యోగి ఒకరు లాస్ ఏంజిల్స్ లో తీసుకువెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు. గాయపడిన ఆ వ్యక్తిని అక్కడే వదిలేసి ఆ శునకాలను దొంగిలించుకుపోయారు. తాను ఎంతో ఇష్టంగా, అభిమానంగా పెంచుకునే వీటిని తిరిగి అప్పగించినవారికి 5 లక్షల డాలర్లను నజరానాగా ఇస్తానని లేడీ గాగా ప్రకటించింది. ఇవి లేక తన హృదయం గాయపడిందని, ఫ్రెంచ్ బుల్ డాగ్స్ అయిన వీటికోసం తన కుటుంబం పరితపిస్తోందని, దయ చేసి వీటిని తమకు అప్పగించినవారికి 5 లక్షల డాలర్లను రివార్డుగా ఇస్తానని కూడా ఆమె పేర్కొంది. కాగా ఈ శునకాలను తీసుకువెళ్తూ దుండగుల కాల్పుల్లో గాయపడిన ర్యాన్ ఫిషర్ అనే ఉద్యోగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

తన జాగిలాలను రక్షించేందుకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని ఈ ఉద్యోగిని లేడీ గాగా ప్రశంసలతో ముంచెత్తింది. మీరు  ఎప్పటికీ మా కుటుంబ హీరో.. ఐ లవ్ యూ అని అభిమానంగా ఆమె ట్వీట్ చేసింది. అటు దుండగుల కాల్పుల్లో ఫిషర్ గాయపడగానే ‘మిస్ ఆసియా’ అనే మూడో శునకం భయంతో పరుగెత్తి పారిపోయిందట. కానీ మళ్ళీ దాన్ని పోలీసులు పట్టుకుని సేఫ్ గా తీసుకు వచ్చారు. ఫ్రెంచ్ బ్రీడ్ బుల్ డాగ్స్ చాలా ఖరీదైనవి. కొన్ని వేలు, ఒకోసారి లక్షల డాలర్లు పెట్టి వీటి అభిమానులు వీటిని కొనుగోలు చేస్తుంటారు. ఇక లేడీ గాగాకు చెందిన ఈ శునకాలపైనా దుండగులు కన్ను వేశారా అణా విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఇంత జరిగినా తన కుక్కలను కేవలం రెండురోజులకే క్షేమంగా తన వద్దకు చేర్చిన పోలీసులపై లేడీ గాగా ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. ర్యాన్ ఫిషర్ పై స్పందించింది గానీ..లాస్ ఏంజిల్స్ పోలీసుల చురుకైన దర్యాప్తు మీద ఈ సింగర్ మౌనం వహించింది.

View this post on Instagram

A post shared by Lady Gaga (@ladygaga)

Read More:

Covid Vaccine: సీనియర్‌ సిటిజెన్స్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ఇలా రిజస్ట్రేషన్‌ చేసుకోండి.. ఎప్పటి నుంచి ప్రారంభమంటే..

Stock market: భారీగా పతనమైన రూపాయి విలువ.. 18 నెలల్లో ఇదే అత్యధికం.. కుదేలైన షేర్ మార్కెట్లు

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్