“ఫిలిక్స్ క్రీక్ రాంచ్” వారి ఉగాది

ఫ్రిస్కోలో వికారి నామ ఉగాది వేడుకను తెలుగువారు వైభవంగా జరుపుకున్నారు. పిల్లలకి ఉగాది పండుగ విశిష్టత తెలియజేయటం కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించారు. ఫిలిక్స్ క్రీక్ రాంచ్ కమ్యూనిటీ తెలుగువారి ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన ఫ్యాషన్ షోలో పిల్లలతో కలిసి తల్లులు ర్యాంప్ వాక్ చేశారు. పిల్లలు స్వయంగా కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించి తెలుగు భాషలో పాటలు పాడి డాన్సులు చేశారు. స్కిట్‌ల రూపంలో తెలుగు మాట్లాడుతూ తెలుగు భాషకు […]

ఫిలిక్స్ క్రీక్ రాంచ్ వారి ఉగాది
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 12, 2019 | 3:39 PM

ఫ్రిస్కోలో వికారి నామ ఉగాది వేడుకను తెలుగువారు వైభవంగా జరుపుకున్నారు. పిల్లలకి ఉగాది పండుగ విశిష్టత తెలియజేయటం కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించారు. ఫిలిక్స్ క్రీక్ రాంచ్ కమ్యూనిటీ తెలుగువారి ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన ఫ్యాషన్ షోలో పిల్లలతో కలిసి తల్లులు ర్యాంప్ వాక్ చేశారు. పిల్లలు స్వయంగా కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించి తెలుగు భాషలో పాటలు పాడి డాన్సులు చేశారు. స్కిట్‌ల రూపంలో తెలుగు మాట్లాడుతూ తెలుగు భాషకు వన్నె తెచ్చారు. కార్యక్రమానికి దాదాపు 500మంది హాజరయ్యారు.