న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. భూప్రకంపనల కారణంగా ఏర్పడిన సునామి.. ఎగసిపడుతున్న సముద్రం..
న్యూజిలాండ్ తీరానికి సమీపంలో భారీ భూకంపం సంభవించింది. దక్షణ పసిపిక్ మహాసముద్రంలో ఈ భూకంపం వచ్చింది. భూకంపం - రిక్టర్ స్కేల్‌పై 7.7 వరకు నమోదైంది.
న్యూజిలాండ్ తీరానికి సమీపంలో భారీ భూకంపం సంభవించింది. దక్షణ పసిపిక్ మహాసముద్రంలో ఈ భూకంపం వచ్చింది. భూకంపం – రిక్టర్ స్కేల్‌పై 7.7 వరకు నమోదైంది. ఇది సునామీకి కారణమవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇండోనేషియాలోని సుమత్రాకు నైరుతి దిశలో అలాగే మరొకటి ఫిలిప్పీన్స్ సమీపంలో ఈ భూకంపాలు సంభవించాయి. భూకంపం కారణంగా సముద్రంలో సునామి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ‘ఈ భూకంపం నుండి ప్రమాదకరమైన సునామీ తరంగాలు ఏర్పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఫిజి, న్యూజిలాండ్, వనాటు మరికొన్ని తీరాల్లో అలల స్థాయికి 0.3 మరియు ఒక మీటర్ మధ్య తరంగాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆస్ట్రేలియా, కుక్ దీవులు అలాగే అమెరికన్ సమోవాతో సహా ఆ ప్రాంతంలోని ఇతర దేశాలకు చిన్న తరంగాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం ఎగసిపడుతున్న కారణంగా బీచ్‌లు మరియు ఇతర వాటర్ ఫ్రంట్ ప్రాంతాల నుండి దూరంగా వెళ్లాలని హెచ్చరిస్తున్నారు .
భూకంపం కారణంగా ప్రాణనష్టం గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రాధమిక నివేదికలు లేవు, దీనిని మొదట యుఎస్ జియోలాజికల్ ఏజెన్సీ 7.7 వద్ద మాగ్నిట్యూడ్ 7.5 గా నమోదు చేసింది. ఇది లాయల్టీ దీవులకు ఆగ్నేయంగా ఆరు మైళ్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. భూమిపై గణనీయమైన నష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. యూరోపియన్ మధ్యధరా భూకంప కేంద్రం భూకంపం యొక్క పరిమాణాన్ని 7.2 గా ఉందని అలాగే న్యూ కాలెడోనియాలోని టాడిన్‌కు తూర్పున 424 కిలోమీటర్ల దూరంలో ఉందని, 10 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు. కేవలం ఒక గంట వ్యవధిలో ఈ ప్రాంతంలో మూడు భూకంపాలు సంభవించాయని వాటిలో న్యూజిలాండ్ భూకంపం బలంగా ఉందని వాతావరణ శాఖ అధికారు అంటున్నారు. ఇండోనేషియా ద్వీపం సుమత్రాలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన కొద్దిసేపటికే న్యూజిలాండ్ లో భూకంపం వచ్చింది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది.