కరోనా టెస్టింగుల్లో మేమే ఫస్ట్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్

కరోనా వైరస్ కేసుల టెస్టింగుల్లో తామే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము 65 మిలియన్లమందికి ఈ టెస్టులు నిర్వహించామని, ఇక 11 వేల టెస్టులతో ఇండియా రెండో స్థానంలో ఉందని ఆయన చెప్పారు.

కరోనా టెస్టింగుల్లో మేమే ఫస్ట్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 11, 2020 | 12:12 PM

కరోనా వైరస్ కేసుల టెస్టింగుల్లో తామే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము 65 మిలియన్లమందికి ఈ టెస్టులు నిర్వహించామని, ఇక 11 వేల టెస్టులతో ఇండియా రెండో స్థానంలో ఉందని ఆయన చెప్పారు. మరే ఇతర దేశాలూ తమ దేశంతో పోటీ పడే స్థాయిలో లేవన్నారు. ప్రపంచంలో మేమే నెం.1  పొజిషన్ లో ఉన్నాం.. పైగా నాణ్యత కలిగిన టెస్టులు చేస్తున్నాం’ అని ప్రకటించుకున్నారు.

ఈ సంవత్సరాంతానికల్లా కరోనా వ్యాక్సీన్ వస్తుందని ఆశిస్తున్నామని, అది రాగానే వెంటనే రోగులకు ఇవ్వడం ప్రారంభిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో ఈ ఏడు రోజుల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గిందన్నారు. అయితే సోమవారం నాటికి దేశంలో 5,075,678 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.