షికాగోలో అల్లర్లు, ఘర్షణలు, 13 మంది పోలీసులకు గాయాలు
అమెరికాలోని షికాగోలో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఆందోళనకారులు రెఛ్చిపోయి లూటీలకు పాల్పడ్డారు.షాపింగ్ మాల్స్, స్టోర్లలోకి చొరబడి నానా బీభత్సం సృష్టించారు.
అమెరికాలోని షికాగోలో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఆందోళనకారులు రెఛ్చిపోయి లూటీలకు పాల్పడ్డారు.షాపింగ్ మాల్స్, స్టోర్లలోకి చొరబడి నానా బీభత్సం సృష్టించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఆందోళనకారుల దాడుల్లో సుమారు 13 మంది పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారుల్లో కొందరు పోలీసులపైనే కాల్పులకు కూడా దిగారు. కత్తులు, పిస్టల్స్ వంటి ఆయుధాలతో షాపింగ్ మాల్స్ లోకి దూసుకువచ్చిన అల్లరిమూకలు తమకు అందినంతా దోచుకుపోయారు. గత మే 25 న నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మినియాపోలిస్ పోలీసుల చేతిలో హతుడైన తరువాత ఇంతపెద్దయెత్తున అల్లర్లు జరగడం ఇదే మొదటిసారి. ఈ ఘర్షణల్లో సుమారు వందమందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.