చికాగోలో సామూహిక దోపిడీ.. వంద మంది అరెస్ట్

అమెరికాలో ఆందోళనకారులు తెగబడ్డారు. రోడ్లపై నిరసన తెలుపుతూ ఒక్కసారిగా షాపులను దోచుకున్నారు. చికాగాలో సోమవారం సాయంత్రం కొందరు ఆందోళన‌కారులు పలు షాపులను లూటీ చేశారు. దీంతో సుమారు 400 మంది పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.అరాచకానికి కారణమైన సుమారు వంద మందిని చికాగో పోలీసులు అరెస్ట్ చేశారు.

చికాగోలో సామూహిక దోపిడీ.. వంద మంది అరెస్ట్
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 11, 2020 | 3:23 PM

అమెరికాలో ఆందోళనకారులు తెగబడ్డారు. రోడ్లపై నిరసన తెలుపుతూ ఒక్కసారిగా షాపులను దోచుకున్నారు. చికాగాలో సోమవారం సాయంత్రం కొందరు ఆందోళన‌కారులు పలు షాపులను లూటీ చేశారు. దీంతో సుమారు 400 మంది పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. గోల్డ్, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వంటి వస్తువులను షాపుల నుంచి దోచుకుంటున్న వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. క్యాష్ కౌంటర్ల‌లోని నగదు బాక్సుల లూటీని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా కొందరు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక సెక్యూరిటీ సిబ్బంది, ఒక పౌరుడు, 13 మంది పోలీసులు గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి అరాచకానికి కారణమైన సుమారు వంద మందిని చికాగో పోలీసులు అరెస్ట్ చేశారు.

చికాగోలో సోమవారం ఉదయం 20 ఏండ్ల అనుమానితుడు పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అతడు పోలీసులపైకి కాల్పులు జరిపుతూ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నిరసన వ్యక్తమైంది. కొందరు సామూహిక దోపిడీకి పిలుపునివ్వడంతో పలు వాహనాల్లో వాణిజ్య సముదాయాలకు వచ్చిన ఆందోళనకారులు అక్కడి షాపుల్లోకి చొరబడి అందినకాడికి దోచుకున్నారు.

కాగా ఈ సామూహిక దోపిడీ వెనక నేర సంబంధమైన కుట్ర ఉన్నదని చికాగో పోలీస్ అధికారి డేవిడ్ బ్రౌన్ తెలిపారు. మేయర్ లోరీ లైట్‌ఫుట్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. సామూహిక దోపిడీని ఎన్ని పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.