Donald Trump: రెండు రోజుల్లోనే మనసు మార్చుకున్న ట్రంప్.. రష్యాపై ఘాటైన వ్యాఖ్యలు
Donald Trump: ఉక్రెయిన్-రష్యా వార్ కొనసాగుతోంది. అయితే ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఇది వరకు ప్రశంసించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు..
Donald Trump: ఉక్రెయిన్-రష్యా వార్ కొనసాగుతోంది. అయితే ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఇది వరకు ప్రశంసించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు మాట మార్చారు. పుతిన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఆయన అధికార గణంపై కూడా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు దారుణమని, అంత్యంత పాశవికమని ఆక్షేపించారు. కన్జర్వేటివ్ పొలికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ ఈ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇది అత్యంత భయంకరమైన సంఘటనగా ఆయన అభివర్ణించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం అత్యంత దారుణమైన విషయమన్నారు. ఉక్రెయిన్ ప్రజల యోగక్షేమాల కోసం ప్రార్థనలు చేస్తున్నానంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లోనూ కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చూపిస్తున్న ధైర్యం, తెగువ ఎంతో ప్రశంసనీయమన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయని, తాను కనుక అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే దొహెట్స్క్, లుహాన్స్క్‌లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తూ అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న నిర్ణయం ఆయన మేధస్సుకు నిదర్శనమని ట్రంప్ కొద్ది రోజుల కిందట తెగ ప్రశంసించారు. ఈ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి రష్యా సేనలను పంపించడాన్ని కూడా ట్రంప్ సమర్థించారు. అయితే పుతిన్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, పుతిన్ గురించి తనకు బాగా తెలుసని చెప్పుకొచ్చిన ట్రంప్.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఘాటుగా విమర్శించారు.
జో బైడెన్‌పై ఘాటు విమర్శలు
డొనాల్ట్ ట్రంప్ రష్యా అధ్యక్షుడితో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఓ తబలాను వాయించినట్లుగా పుతిన్ అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ను వాయిచేస్తున్నారని ఘాటుగా విమర్శలు చేశారు. 2024లో తాను మళ్లీ పోటీ చేస్తానని ట్రంప్ చెప్పారు.
ఇవి కూడా చదవండి: