US Visa: అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్‌ న్యూస్‌.. ఆ షరతును తొలగిస్తూ నిర్ణయం..

US Visa: అమెరికా (America) వెళ్లే భారతీయులకు అగ్రరాజ్యం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కొన్ని రకాల వీసా (Visa) దరఖాస్తుదారులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేస్తు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారు కచ్చితంగా ఇంటర్వ్యూకు...

US Visa: అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్‌ న్యూస్‌.. ఆ షరతును తొలగిస్తూ నిర్ణయం..
Us Visa
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 28, 2022 | 7:25 AM

US Visa: అమెరికా (America) వెళ్లే భారతీయులకు అగ్రరాజ్యం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కొన్ని రకాల వీసా (Visa) దరఖాస్తుదారులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేస్తు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారు కచ్చితంగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులను పలు రకాల ప్రశ్నలను ఈ పర్సనల్‌ ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. ఇందులో సెలక్ట్ అయితేనే వీసా జారీ చేస్తారు. అయితే తాజాగా ఈ ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అమెరికన్‌ సీనియర్‌ దౌత్యవేత్త తెలిపారు.

ఈ ఇంటర్వ్యూల రద్దు కేవలం విద్యార్థులు (F, M, J), కళాకారులు , విశిష్ట ప్రతిభావంతులు(O, P, Q ), ఉద్యోగులు(H-1, H-2, H-3, L)లకు సంబంధించిన వీసాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇంటర్వ్యూలను రద్దు చేయడం వల్ల వీసా దరఖాస్తుదారులకు మేలు జరుగుతుందని దక్షిణాసియా కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భూటోరియా అన్నారు. భూటోరియా ఆసియా అమెరికన్లకు సంబంధించిన అంశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సలహదారుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ వ్యక్తిగత ఇంటర్వ్యూల రద్దు విధానం వర్తించాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. గతంలో అమెరికాకు సంబంధించిన ఏదైన వీసా పొంది ఉండాలి. అలాగే వీసా తిరస్కరణకు గురైనవారు, తగిన అర్హత లేనివారికి ఇది వర్తించదు. నిజానికి అమెరికా వెళ్లాలంటే కచ్చితంగా అన్ని రకాల వీసాల దరఖాస్తుదారులు ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. కానీ కరోనా నేపథ్యంలో ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Also Read” Aadavallu Meeku Johaarlu Trailer: ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ రిలీజ్.. ఫుల్ కామెడీతో వస్తోన్న శర్వానంద్..

Defection Case: గోవాలో ఫిరాయింపులపై కాంగ్రెస్ ఫోకస్.. మరో అవకాశం దిశగా ఆ పార్టీ అడుగులు..

ఖుష్బూ ను ఇలా ఎప్పుడైనా చూసారా..? యంగ్ హీరోయిన్స్‌కి పోటీనే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!