AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలియుగ దానకర్ణుడు చార్లెస్ చక్ ఫినీ !

పది రూపాయిలు దానం చేయడాని పదిసార్లు ముందూ వెనుకా ఆలోచిస్తాం. అలాంటిది తను జీవిత కాలం సంపాదించిన యావదాస్తి 8 బిలియన్ల డాలర్లు అంటే రూ.58 వేల కోట్లను దారాదత్తం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు ఛార్లెస్ ‘చక్‌’ ఫీనీ.

కలియుగ దానకర్ణుడు చార్లెస్ చక్ ఫినీ !
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 17, 2020 | 1:32 PM

Share

పది రూపాయిలు దానం చేయడాని పదిసార్లు ముందూ వెనుకా ఆలోచిస్తాం. అలాంటిది తాను జీవితాంతం సంపాదించిన ఆస్తిని దానం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. తనకున్న యావదాస్తి 8 బిలియన్ల డాలర్లు అంటే రూ.58 వేల కోట్లను దారాదత్తం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు డ్యూటీ ఫ్రీ షాపర్స్ సహ-వ్యవస్థాపకుడు ఛార్లెస్ ‘చక్‌’ ఫీనీ. తన స్వచ్ఛంద సంస్థ ‘అట్లాంటిక్‌ ఫిలాంత్రోపీస్‌’ ద్వారా తనకున్న ఆస్తిని దానం చేసి తన ఔదర్యాన్ని చాటుకున్నారు.

ఎనిమిదేళ్ల కిందట ప్రకటించినట్టే మొత్తం ఆస్తిని దానం చేసి మాట నిలబెట్టుకున్నారు. కోట్లకు పడగెత్తినా దాతృత్వంలోనే ఆనందాన్ని వెదుకున్నారు. పదవీ విరమణ తర్వాత తన భార్యతో కలిసి జీవించేందుకు రూ.14కోట్లనే ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలకు దానమిచ్చేశారు. ప్రస్తుత నెలతో ఆయన దానాలు పూర్తి కావడంతో ఈ నెల 14న ఫీనీ స్వచ్ఛంద సంస్థ ప్రయాణం ముగిసింది.

‘చాలా నేర్చుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నేను బతికుండగానే ఈ మంచి పని పూర్తి కావడం నాకు ఎంతో సంతృప్తిగా ఉంది.. ఈ ప్రయాణంలో తనకు సహకరించి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు. బతికుండగానే దానం చేయడం గురించి ఆశ్చర్యపోతున్నవారికి దీన్ని ప్రయత్నించండి, మీకు నచ్చుతుంది’’ అని ఛార్లెస్ ఫోర్బ్స్‌ పత్రికతో వ్యాఖ్యానించారు.

బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ తమ దాతృత్వాన్ని చాటుకోవడం వెనుక ఫీనియే స్ఫూర్తిదాత. ‘మా అపార సంపదలను దానం చేయడానికి చక్‌ మాకు ఓ మార్గం చూపారు. సగం అస్తులు కాదు, యావదాస్తిని దానం చేయాలంటూ తను నాతో పాటు ఎంతోమందిలో స్ఫూర్తిని కలిగించారు’ అని బిల్‌ గేట్స్‌ పేర్కొన్నారు. దానంలో జేమ్స్‌బాండ్‌గా చార్ల్స్ చక్‌ను అందరూ పిలుస్తారు. తొలిసారిగా 1984లో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి ఉత్తర ఐర్లాండ్‌లో శాంతి, అలాగే వియత్నాంలో ఆరోగ్య సంరక్షణకు కృషిచేశారు.

ఒకప్పుడు రూ.58వేల కోట్ల ఆస్తిపరుడు ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ సాధారణ అపార్ట్‌మెంట్‌‌లో భార్యతో కలిసి విశ్రాంత జీవితాన్ని ఓ మధ్యతరగతి మనిషిలా గడపడం గొప్ప విషయం. ఛార్లెస్ చక్ 1960లో రాబర్ట్ మిల్లర్‌తో కలిసి డ్యూటీ ఫ్రీ షాపర్స్‌ను ఏర్పాటుచేశారు. తన ఆస్తిలో 3.7 బిలియన్లు విద్యకు, 870 మిలిన్లు మానవ హక్కులు, సామాజిక మార్పునకు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి 76 మిలియన్లు, వియత్నాంలో ప్రజారోగ్య సంరక్షణకు 270 మిలియన్ డాలర్లు, మరో 700 మిలియన్ డాలర్ల ఆరోగ్య సంరక్షణకు అందజేశారు.

చివరిగా న్యూయార్క్ నగరం రూజ్‌వెల్ట్ ద్వీపంలో టెక్నాలజీ క్యాంపస్‌ను నిర్మాణం కోసం 350 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. ‘విలువైన కారణాలకు మద్దతు తెలపడం ద్వారా చాలా మంచిని సాధించగలిగినప్పుడు ఇవ్వడంలో ఆలస్యానికి నేను చాలా తక్కువ కారణాలను వెదుకుతాను. అలా కాకుండా, మీరు చనిపోయినప్పుడు ఇవ్వడం కంటే మీరు బతికున్నటప్పుడు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంటుంది’అని గతేడాది ఈ దానకర్ణుడు వ్యాఖ్యానించారు.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే