Independence Day: టైమ్స్ స్క్వేర్‌లో ఇండిపెండ్స్ డే సెలబ్రేషన్స్.. భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రవాసాంధ్రులు
Independence Day: ఆగష్టు 15 న 75వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను యావత్ భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భారతీయులు ఘనంగా జరుపుకున్నారు..
Independence Day: ఆగష్టు 15 న 75వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను యావత్ భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. భారత్‌తో పాటు ప్రపంచదేశాల్లోనూ ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని త్రివర్ణ పతాకం ఎగురవేసి పండగలా జరుపుకున్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరిట జరుపుకున్న ఈ వేడుకలకు అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికయ్యింది.
న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో ఉన్న భారీ బిల్‌బోర్డ్స్‌లో ఆగష్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ప్రవాసాంధ్రలు ఎగురవేశారు. అనంతరం జాతీయ జెండాకు శాల్యూట్ చేసి.. భారత్ మాతకు జై అంటూ నినాదాలు చేశారు. ప్రవాసాంధ్రులు వందేమాతరం పాటను ఆలపించారు.
ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన పోల్ 25 అడుగుల ఎత్తు ఉండగా.. భారతీయ జెండా 6 అడుగుల 10 అడుగులు ఉంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్, న్యూజెర్సీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ కనెక్టికట్ టైమ్స్ స్క్వేర్‌లో త్రివర్ణ పతాకం ఎగరవేయడం ప్రారంభించారు. ఈ వేడుకలు ఆగస్టు 15 న పగటిపూట నిర్వహించారు. టైమ్స్ స్క్వేర్‌లోని మొదటి ఇండియా డే బిల్‌బోర్డ్ లో 24 గంటల పాటు ప్రదర్శించబడుతుంది.
#WATCH | Indian diaspora unfurl Tricolour at Times Square in New York City on August 15 to commemorate India’s 75th Independence Day. pic.twitter.com/M5ZLzpmgk4
— ANI (@ANI) August 15, 2021
Also Read:తక్కువ ఖర్చుతో వాషింగ్ మెషిన్‌ను తయారు చేసిన ఇంజనీర్.. త్వరలో భారత్‌లోకి ఎంట్రీ