ట్రంప్ కి ఎదురుగాలి.. గళమెత్తిన మాజీ అధ్యక్షుడు ఒబామా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారిగా గళమెత్తారు. కరోనా వైరస్ సంక్షోభం పట్ల ట్రంప్ అనుసరిస్తున్న విధానం అతి దారుణ 'డిజాస్టర్' గా ఉందని అభివర్ణించారు..

ట్రంప్ కి ఎదురుగాలి.. గళమెత్తిన మాజీ అధ్యక్షుడు ఒబామా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 10, 2020 | 12:22 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారిగా గళమెత్తారు. కరోనా వైరస్ సంక్షోభం పట్ల ట్రంప్ అనుసరిస్తున్న విధానం అతి దారుణ ‘డిజాస్టర్’ గా ఉందని అభివర్ణించారు. ఇది ‘గందరగోళ విపత్తు’ అని కూడా వ్యాఖ్యానించారు. తన గత ప్రభుత్వంలోని మాజీ సహచరులతో ఒబామా ఈ మేరకు మాట్లాడిన వెబ్ కాల్ లీకయి.. ఈ సంభాషణ సరికొత్త ‘రాజకీయ దుమారానికి’ నాంది పలికింది. ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ పై వఛ్చిన అభియోగాలను ఉపసంహరించాలని న్యాయ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఒబామా తీవ్రంగా తప్పు పట్టారు. (ట్రంప్ అధ్యక్షుడు కాక ముందు రష్యా రాయబారితో తన కాంటాక్ట్ గురించి 2017 డిసెంబరులో ఫ్లిన్ తప్పుడు స్టేట్ మెంట్ ఇఛ్చాడట. దానిపై రష్యా దర్యాప్తు జరిపి అతడిని దోషిగా పేర్కొంది). అయితే కావాలనే ఫ్లిన్ మీద వఛ్చిన ఆరోపణల నుంచి అమెరికా న్యాయమంత్రిత్వ శాఖ అతడిని  తప్పించిందని ఒబామా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక తన మూడువేల మంది మాజీ (అల్యుమినీ) సభ్యులతో మాట్లాడిన ఒబామా.. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ను గెలిపించేందుకు తన సమయాన్ని వెచ్చిస్తానని చెప్పారు. మీరు కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని వారిని పరోక్షంగా కోరారు. వచ్ఛే నవంబరులో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. కాగా అమెరికాలో కరోనా వ్యాధికి గురై మరణించినవారి సంఖ్య 77 వేలకు చేరింది. లక్షా 30 వేల మందికి ఈ వైరస్ సోకింది.

Latest Articles