AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్: డాక్టర్లు, నర్సులకు గుడ్ న్యూస్.. ఇక నేరుగా గ్రీన్ కార్డ్

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా ప్రభావం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో అక్కడి చట్టసభ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికీ

కరోనా ఎఫెక్ట్: డాక్టర్లు, నర్సులకు గుడ్ న్యూస్.. ఇక నేరుగా గ్రీన్ కార్డ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 10, 2020 | 11:09 AM

Share

Green Cards: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా ప్రభావం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో అక్కడి చట్టసభ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికీ కేటాయించని దాదాపు 40వేల గ్రీన్‌ కార్డులను విదేశీ డాక్టర్లు, నర్సులకు తక్షణమే జారీ చేయాలంటూ అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభల్లోనూ బిల్లును ప్రవేశపెట్టారు. గతంలో కాంగ్రెస్‌ ఆమోదించినప్పటికీ జారీ కాని గ్రీన్‌ కార్డులను ఇప్పుడు మంజూరు చేయాలని బిల్లులో పేర్కొన్నారు.

వివరాల్లోకెళితే.. అమెరికాలో 12లక్షల మందికిపైగా కరోనా బారిన పడగా, మృతుల సంఖ్య 77 వేలు దాటింది. ఈ నేపథ్యంలో చట్టసభ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ది హెల్త్‌కేర్‌ వర్క్‌ ఫోర్స్‌ రీసైలెన్స్‌ యాక్ట్‌ ప్రకారం ఏళ్లుగా వినియోగించకుండా ఉన్న గ్రీన్‌కార్డులకు అనుమతి ఇచ్చే అధికారం అక్కడి కాంగ్రెస్‌కు ఉంది. కార్డులను మంజూరు చేయడం ద్వారా అక్కడి పౌరులకు వైద్య సహాయం అందించడంతో పాటు, అమెరికాలో శాశ్వత నివాసాన్ని పొందవచ్చు.

కాగా.. అమెరికా కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదనల ప్రకారం చట్టం ఆమోదం పొందితే 25వేలమంది నర్సులు, 15వేల మంది వైద్యులు గ్రీన్‌కార్డులను పొందే అవకాశం ఉంది. వీరంతా కొవిడ్‌-19పై పోరులో భాగంగా వైద్య సేవలు అందించాలి. హెచ్‌-1బీ, జే2 వీసాలపై ఉన్న భారతీయ వైద్యులు, నర్సులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.

Follow Us
ఆడపిల్ల పుట్టడం ఎందుకు శుభం అంటారు? గరుడ పురాణం చెప్పే రహస్యం
ఆడపిల్ల పుట్టడం ఎందుకు శుభం అంటారు? గరుడ పురాణం చెప్పే రహస్యం
అటుకులతో కమ్మని పాయసం.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు
అటుకులతో కమ్మని పాయసం.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు
మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్.. అరాచకం రాజ్యమేలుతుందన్న..
మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్.. అరాచకం రాజ్యమేలుతుందన్న..
ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా రిజెక్ట్ అవుతున్నారా?.. సీక్రెట్ రెమిడీ
ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా రిజెక్ట్ అవుతున్నారా?.. సీక్రెట్ రెమిడీ
చల్లగా కమ్మగా ఉండే సొరకాయ పెరుగు పచ్చడి ఇలా చేయండి
చల్లగా కమ్మగా ఉండే సొరకాయ పెరుగు పచ్చడి ఇలా చేయండి
ప్రయాణమే ప్రాణమా? తిరుగుతూ డబ్బు సంపాదించే ఉద్యోగం కావాలా?
ప్రయాణమే ప్రాణమా? తిరుగుతూ డబ్బు సంపాదించే ఉద్యోగం కావాలా?
చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు 12 వేల కోట్ల ఆస్తికి యజ
చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు 12 వేల కోట్ల ఆస్తికి యజ
IPL Unluckiest Players: ఐపీఎల్ హిస్టరీలోనే బ్యాడ్‌లక్ ప్లేయర్స్..
IPL Unluckiest Players: ఐపీఎల్ హిస్టరీలోనే బ్యాడ్‌లక్ ప్లేయర్స్..
ఆకాశంలో అద్భుతం! తిరుమల శ్రీవారి సన్నిధిలో మహాదేవుడు దర్శనం
ఆకాశంలో అద్భుతం! తిరుమల శ్రీవారి సన్నిధిలో మహాదేవుడు దర్శనం
Weekly Horoscope: వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం..
Weekly Horoscope: వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం..