US Summer: అమెరికాలో భానుడి ప్రతాపం.. ఎనభై ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు!

US Summer: మనదేశంలో చూసే ఎండల వేడి ఇప్పుడు అమెరికా చూస్తోంది. అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.

US Summer: అమెరికాలో భానుడి ప్రతాపం.. ఎనభై ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు!
Us Summer effect
Follow us
KVD Varma

|

Updated on: Jun 29, 2021 | 7:52 PM

US Summer: మనదేశంలో చూసే ఎండల వేడి ఇప్పుడు అమెరికా చూస్తోంది. అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దాదాపు 80 ఏళ్ల తరువాత ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ వేడి దెబ్బకు ఒలింపిక్స్ ట్రయల్స్ కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే తీవ్రత ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో, పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుకుంది. వాతావరణ శాఖ దీనిని ప్రమాదకరమైన వేడిగా చెబుతోంది. ఇది చాలా అసాధారణమైనదిగా అభివర్ణించింది. ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో ఉష్ణోగ్రత ఆదివారం 44.4 డిగ్రీలకు చేరుకుంది. ఇది యూఎస్ చరిత్రలో హాటెస్ట్ రోజుగా రికార్డ్ అయింది. యూఎస్ లో ఉష్నోగ్రతల రికార్డ్ కీపింగ్ 1940 లో ప్రారంభమైంది, అప్పటి నుండి ఇదే అత్యధిక పగటి ఉష్ణోగ్రత కావడం గమనార్హం.

మరోవైపు సీటెల్‌లో ఉష్ణోగ్రత కూడా 40 డిగ్రీలకు చేరుకుంది. యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ ఇక్కడి వాతావరణ రికార్డులో మొదటిసారి ఈ ఉష్ణోగ్రత వరుసగా రెండు రోజులు నమోదైందని చెప్పింది. ఇంత అధిక వేడి కారణంగా, యుఎస్ ఒలింపిక్ క్రీడల ట్రాక్, ఫీల్డ్ ట్రయల్స్‌లో ఇబ్బంది ఏర్పడింది. ఒరెగాన్‌లోని యూజీన్‌లో ట్రయల్స్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. అధిక వేడి కారణంగా అభిమానులను స్టేడియం నుండి ఖాళీ చేయమని కోరారు.

మంచి వర్షపాతం ఉండే నగరాల్లో ఇది భరించలేని పరిస్థితి తెచ్చిందని యుఎస్ వాతావరణ శాఖ తెలిపింది. ఇది కాక, 1894 లో రికార్డు సృష్టించిన తరువాత మొదటిసారిగా, ఈ అధిక ఉష్ణోగ్రతలు ఈ ప్రాంతంలో వరుసగా రెండు రోజులు నమోదయ్యాయి. ఈ ఎండ దెబ్బకు మార్కెట్లలో పోర్టబుల్ ఎసిలు, ఫాన్స్ అమ్మకాలు పెరిగాయి. ఆసుపత్రులు బహిరంగ వ్యాక్సిన్ కేంద్రాలను మూసివేసాయి. వాషింగ్టన్ శీతలీకరణ కేంద్రాల్లోని వ్యక్తుల పరిమితిని రద్దు చేశారు. నార్త్ సీటెల్‌లోని హోటలియర్స్ హోటల్‌లోని అన్ని గదులు బుక్ అయిపోయినట్టు చెప్పారు. మరోవైపు, యూరప్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ ప్రజలను బాధపెట్టిన ఈ వేడి తరంగం ఇప్పుడు బ్రిటన్ వైపు కదులుతోంది.

కువైట్ లో..

కాగా,  ఒక్క కెనడాలో మాత్రమే ఈ వేసవిలో ఎండ ప్రతాపం చూపించలేదు. మరోవైపు మధ్యప్రాచ్య దేశాలు కూడా అధిక ఉష్నోగ్రతలతో బాధపడుతున్నాయి. కువైట్‌లోని రెండు నగరాల్లో గత 24 గంటల్లో భూమిపై అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కువైట్ వాతావరణ శాఖ ప్రకారం, ఆదివారం అల్ జహ్రాలో 53 డిగ్రీలు, అల్-నువైసిబ్‌లో 52 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి.యుఎఇలో కూడా ఉష్ణోగ్రత 50 డిగ్రీల దగ్గర నమోదు అవుతోంది.

Also Read: Facebook: సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ సరికొత్త రికార్డు..భారీ స్థాయిలో పెరిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్!

ఫ్లోరిడాలో బిల్డింగ్ కూలిన ఘటన..గల్లంతైనవారిలో ఇండో-అమెరికన్ కుటుంబం