కోవిడ్ సెకండ్ వేవ్- డేల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు: కరోనా భూతంతో అప్పుడప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని.. మళ్లీ సెకండ్ కాకలవికలం చేసింది. కరోనా సెకండ్ వేవ్‌లో లక్షలాది మంది మరణించగా.. కోటి మందికి పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. వైద్య సంక్షోభం, వ్యాక్సినేషన్, ఆక్సిజన్ లాంటి సమస్యలు చాలా దేశాలను వణికించాయి. చాలా దేశాలు లాక్డౌన్‌తో వైరస్‌ను ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత ప్రపంచాన్ని డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ప్రపంచాన్ని కుదిపేశాయి. తాజాగా దక్షిణాఫిక్రాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్.. థర్డ్ వేవ్‌కు దారి తీస్తుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ తరుణంలో మళ్లీ ప్రపంచం.. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది.