Worlds Best Cities 2025: ప్రపంచంలోని ఉత్తమ నగరాలు.. వరుసగా పదో ఏడాది కూడా వరల్డ్ బెస్ట్ సిటీ ఇదే..!
2025 ఏడాదికి సంబంధించిన టాప్-100 జాబితాలో అత్యధికంగా అమెరికాలోని 36 నగరాలు స్థానం సంపాదించడం విశేషం. కానీ, ఈ జాబితాలో భారతదేశంలోని అతిపెద్ద నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు
ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా లండన్ సిటీ నిలిచింది. గత పదేళ్లుగా లండన్ నగరం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ.. వరల్డ్ బెస్ట్ సిటీగా ఉంటోంది. నంబర్ 1 – లండన్, నంబర్ టూ – న్యూయార్క్, నంబర్ త్రీ – పారిస్…. రెసోనన్స్ కన్సల్టెన్సీ సంస్థ ఇప్సోస్‌తో కలిసి నిర్వహించిన ‘వరల్డ్ బెస్ట్ సిటీస్ సర్వే 2025’లో టాప్-త్రీ సిటీస్ ఇవే. లండన్ తర్వాత స్థానాల్లో న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్, మాడ్రిడ్, బార్సిలోనా, బెర్లిన్, సిడ్నీ, తదితర నగరాలు టాప్-10లో ఉన్నాయి.
రియల్ ఎస్టేట్, టూరిజం, ఆర్థికాభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ సలహదారుగా ఉన్న రిసోనెన్స్ సంస్థ ఈ వరల్డ్ బెస్ట్ సిటీస్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఏ నగరంలో జీవించాలనుకుంటున్నారు? ఏ నగరాన్ని చూడాలనుకుంటున్నారు? ఏ నగరంలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్నారనే అంశాల ప్రాతిపదికన ఈ టాప్ సిటీస్ జాబితాను రూపొందిస్తారు. ఈ సర్వే కోసం రెసోనన్స్ టీమ్ 31 దేశాల్లోని 22,000 మందిని సర్వే చేసింది.
2025 ఏడాదికి సంబంధించిన టాప్-100 జాబితాలో అత్యధికంగా అమెరికాలోని 36 నగరాలు స్థానం సంపాదించడం విశేషం. కానీ, ఈ జాబితాలో భారతదేశంలోని అతిపెద్ద నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు ఏమైనా చోటు దక్కిందా అంటే…లేదనే చెబుతున్నారు. ఈ నగరాలకు అసలు టాప్-100లో కూడా చోటు దక్కలేదని రెసోనన్స్ కన్సల్టెన్సీ సీఈఓ క్రిస్ ఫెయిర్ రాయిటర్స్ వార్తా సంస్థతో వివరించినట్టుగా సమాచారం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..