World Obesity Day: రోజు రోజుకీ పెరుగుతున్న ఊబకాయుల సంఖ్య.. ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం కారణం అంటూ హెచ్చరిక

|

Mar 04, 2023 | 7:11 AM

వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ రిపోర్ట్‌ ఆందోళన కలిగిస్తోంది. ప్రజెంట్‌ సిట్యువేషనే కొనసాగితే 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికిపైగా ప్రజలు ఊబకాయం బారిన పడతారని హెచ్చరించింది. ఇంతకీ..ఆ రిపోర్టులో ఏముంది..?

World Obesity Day: రోజు రోజుకీ పెరుగుతున్న ఊబకాయుల సంఖ్య.. ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం కారణం అంటూ హెచ్చరిక
World Obesity Day
Follow us on

2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఊబకాయం, అధిక బరువుతో బాధపడతారని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ హెచ్చరించింది. అప్పటివరకూ వాల్డ్‌వైజ్‌ పాపులేషన్‌ 400కోట్లను దాటేస్తుందని తాజా రిపోర్టులో తెలిపింది. ఆఫ్రికా, ఆసియాలోని తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ఈ భారీ పెరుగుదల నమోదవుతుందని తెలిపింది. ఎక్కువగా బాలబాలికల్లో ఈ సమస్య అధికంగా ఉంటుందని అంచనా వేసింది. దీనికోసం తక్షణమే సరైన చర్యలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదని ఒబేసిటీ ఫెడరేషన్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

బాలబాలికల్లో ఊబకాయం రేట్లు 2020 నాటితో పోలిస్తే 2035 నాటికి రెట్టింపు అవుతాయని రిపోర్టులో పేర్కొంది. ఈ సమస్య వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏటా 4 ట్రిలియన్‌ డాలర్లకుపైగా ప్రభావం పడుతుంది. ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 3 శాతానికి సమానం! ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎక్కువగా నమోదవుతుందని అంచనా వేసిన 10 దేశాల్లో తొమ్మిది..ఆఫ్రికా, ఆసియాలోని తక్కువ లేదా తక్కువ మధ్య ఆదాయ దేశాలే ఉంటాయని WOFతన నివేదికలో పేర్కొంది. బాడీ మాస్ ఇండెక్స్ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.

అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం, శారీరక శ్రమ తగ్గడం, ఆహార సరఫరా, మార్కెటింగ్‌ విధానాల్లో లోపాలు, బరువు నిర్వహణ, ఆరోగ్య విద్యలో తక్కువ వనరులతో కూడిన సేవలు.. ఈ సమస్య పెరుగుదలకు కారణమవుతాయని నివేదిక తెలిపింది. ఊబకాయంపై ప్రపంచ దేశాలు ఇప్పుడే మేల్కొని.. తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఫెడరేషన్ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..