జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులలో మంకీపాక్స్ వైరస్ కూడా ప్రధానమైనది. దానిపై ప్రపంచస్థాయి ఆరోగ్య నిపుణులతో వరుస సంప్రదింపుల తర్వాత, ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ఓ నిర్ణయం తీసుకుంది. ఇకపై మంకీపాక్స్‌ను ఎంఫాక్స్‌గా పిలవాలని ప్రకటించింది. వ్యాధి పేరు చుట్టూ జాత్యహంకార, కళంకం కలిగించే భాష అంటూ పలు నివేదికలు వచ్చిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్త ఈ నిర్ణయానికి వచ్చింది. ప్రపంచవ్యాప్త వ్యాధి వ్యాప్తి మధ్య దాని పేరు వల్ల ఏర్పడిన గందరగోళం గురించి నిపుణులు లేవనెత్తిన ఆందోళనలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని డబ్య్లూహెచ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే ఎంఫాక్స్ అనేది ఒక అరుదైన వైరల్ వ్యాధి. ఇది ప్రధానంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాలలో కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 80,000 కంటే ఎక్కువ కేసులు నమోదవ్వగా, 55 మంది మరణించారు. ఇప్పటికే దాదాపు 110 దేశాలు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. “అనేక మంది నాయకులు, దేశాలు మంకీపాక్స్ పేరుపై అనేక పబ్లిక్, ప్రైవేట్ సమావేశాలలో ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే, ఆ పేరులో మార్పును ప్రతిపాదించాలని డబ్ల్యూహెచ్‌ఓని కోరాయి’’ అని పేరు మార్చడానికి గల కారణాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
World Health Organization (WHO) has renamed monkeypox as mpox, citing that the disease could be construed as discriminatory & racist, reports The Associated Press
— ANI (@ANI) November 28, 2022
మంకీపాక్స్ వైరస్‌ను మొదటిసారిగా 1958లో కోతులలో గుర్తించారు. దానికి రెండు దశాబ్దాల తర్వాత (1970లో) కాంగో కు చెందిన ఓ ఈ వైరస్‌ను బాలుడిలో కనుగొన్నారు. మానవుల్లో గుర్తించిన తొలి మంకీపాక్స్ కేసు కూడా అదే. అప్పటినుంచి పలు ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ అధికంగా ప్రబలుతూ వచ్చింది. అయితే ఈ ఏడాది దాని వ్యాప్తి విస్తృతంగా పెరిగి దాదాపు 110 దేశాలకు చేరింది. ప్రపంచదేశాలకు వ్యాపించినప్పటికీ ఈ వ్యాధిని ఆఫ్రికాకు చెందినట్లుగానే పిలవడాన్ని పలువురు జీవశాస్త్రవేత్తలు ఖండిచారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఆఫ్రికాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు. ఈ వైరస్‌ను ఇకపై ప్రపంచానికి చెందినది చెప్పుకోవడం సమంజసం అని వారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు సూచించారు.ఇంకా వివక్షత లేని పేరును వ్యాధికి పెట్టాలని ఆ లేఖలో పేర్కొన్నారు. వారి లేఖను పరిగణనలోకి తీసుకున్న డబ్ల్యూహెచ్‌ఓ.. మంకీపాక్స్ పేరును ఎమ్‌పాక్స్‌గా మార్చినట్లు తాజాగా ప్రకటన చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..